Jyothi Rai : ఆ ప్లేస్‌లో టాటూ వేయించుకున్న ఫేమస్ నటి.. ఏం టాటూ?
తాజాగా జ్యోతి రాయ్ కి సంబంధించిన ఓ టాటూ వీడియో వైరల్ గా మారింది.
- Author : News Desk
Date : 11-02-2024 - 10:47 IST
Published By : Hashtagu Telugu Desk
గుప్పెడంత మనుసు సీరియల్ లో జగతి మేడంగా(Jagathi Madam) బాగా పాపులారిటీ తెచ్చుకుంది జ్యోతి రాయ్(Jyothi Rai). తన సొంత పేరు కంటే జగతి మేడంగానే బాగా ఫేమస్ అయింది. ఇటీవల తన సోషల్ మీడియాలో పెట్టే హాట్ హాట్ బోల్డ్ ఫొటోలతో మరింత ఫేమస్ అయింది. గతంలో ఓ పెళ్లి, విడాకులు అయిన జ్యోతి సుక్కు పూర్వరాజ్ అనే ఓ డైరెక్టర్ తో రెండో పెళ్ళికి రెడీ అయింది. కొన్ని రాజుల క్రితమే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.
తాజాగా జ్యోతి రాయ్ కి సంబంధించిన ఓ టాటూ వీడియో వైరల్ గా మారింది. తన ఎదపై జ్యోతిరాయ్ టాటూ వేయించుకుంది. hope అనే పదంతో పాటు బటర్ ఫ్లై సింబల్ ని వేయించుకుంది. గొంగళిపురుగు నుంచి అందమైన సీతాకోకచిలుకలా మారడానికి జీవితంపై ఆశ ఉండాలి అనే అర్థంతో ఈ టాటూ వేయించుకుంది. ఈ టాటూని తన కాబోయే భర్త సుక్కు పూర్వరాజ్ డిజైన్ చేసాడు.
ప్రస్తుతం జ్యోతిరాయ్ ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ తో పాటు, పలు సినిమాల్లో నటిస్తుంది. ఇప్పుడు ఈ టాటూ వేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
Also Read : Anand Deverakonda : విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ బ్రేకప్ స్టోరీ తెలుసా?