Jr NTR On Rajamouli: దర్శకుడు రాజమౌళిపై జూ. ఎన్టీఆర్ కామెంట్స్..!
జూ. ఎన్టీఆర్ ఏదీ జరిగినా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేస్తుంటాడు.
- Author : Hashtag U
Date : 03-10-2022 - 10:15 IST
Published By : Hashtagu Telugu Desk
జూ. ఎన్టీఆర్ ఏదీ జరిగినా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేస్తుంటాడు. కేవలం తన మూవీ అప్డేట్స్ మాత్రమే కాకుండా టాలీవుడ్‌కు చెందిన మంచి విషయాలను ఎన్టీఆర్ ఎప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. అయితే కెరీర్ ఒకేసారి ప్రారంభించారు ఎన్టీఆర్, రాజమౌళి. వారి ఇద్దరి మధ్య బంధం మాటల్లో చెప్పలేనిది. జక్కన్న అంటే తారక్‌కు ఎంత ఇష్టమో.. ఎన్టీఆర్ అంటే రాజమౌళికి కూడా అంతే ప్రేమ. వీరిద్దరి కలయికలో ఇప్పటివరకు 4 సినిమాలు వచ్చాయి. ఆ 4 సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్ మూవీలే కావడం విశేషం.
కెరీర్ తొలిరోజుల్లో జూనియర్ ఎన్టీఆర్‌తో స్టూడెంట్ నెం.1 తెరకెక్కించిన రాజమౌళి.. ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ.. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా జూ.ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని చైనీస్ థియేటర్ ఐమాక్స్ స్క్రీన్స్‌పై ఆర్ఆర్ఆర్ మూవీ ప్రదర్శన జరుగుతుండగా.. అదే సమయంలో అక్కడకు వచ్చిన దర్శకుడు రాజమౌళిని చూసిన ప్రేక్షకులంతా నిల్చిని చప్పట్లు కొడుతూ ఆహ్వానించారు. ఆ వీడియోను ఎన్టీఆర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ.. ఈ చప్పట్లు, మరెన్నో గౌరవాలకు మీరు అర్హులు జక్కన్న అంటూ కామెంట్ చేశాడు.
You deserve all the applause you’re getting and much more Jakkanna @ssrajamouli https://t.co/jMbSlGuobS
— Jr NTR (@tarak9999) October 3, 2022