Jigris : కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా జిగ్రీస్ ఫస్ట్ సాంగ్ విడుదల
Jigris : తాజాగా విడుదలైన మొదటి పాట 'తిరిగే భూమి'కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటను యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లాంచ్ చేశారు.
- By Sudheer Published Date - 10:15 PM, Fri - 29 August 25

యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘జిగ్రీస్’ (Jigris ) సినిమా టీజర్, మరియు మొదటి పాట ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్ సంపాదిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రెండు మిలియన్ల వ్యూస్‌ను దాటి ఈ సినిమాపై యువతలో మంచి ఆసక్తిని పెంచింది. టీజర్ తో వచ్చిన ఈ బజ్ కి తోడు, చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలో తాజాగా మొదటి పాట ‘తిరిగే భూమి’ ని విడుదల చేయగా, దీనికి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ ‘తిరిగే భూమి’ పాటను యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఈ పాటలో ఎనర్జీ చాలా బాగుంది. కమ్రాన్ సయ్యద్ గారి ట్యూన్ చాలా ఫ్రెష్ గా ఉంది. లిరిక్స్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. జిగ్రీస్ టీమ్ అంతా ఎంతో ప్యాషన్ తో పని చేసింది కాబట్టి ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది” అని చిత్ర బృందాన్ని అభినందించారు. తన షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా సమయం కేటాయించి ఈ కార్యక్రమానికి హాజరైనట్లు కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.
ఈ చిత్రంలో కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ వంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కృష్ణ వోడపల్లి మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కమ్రాన్ సయ్యద్ సంగీతం, ఈశ్వర్ ఆదిత్య ఛాయాగ్రహణం, చాణక్య రెడ్డి తూర్పు ఎడిటింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. T-Series మ్యూజిక్ లేబుల్ ద్వారా విడుదలైన ఈ పాట, టీజర్‌తో కలిసి సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. డిజిటల్ మార్కెటింగ్ కు సంబంధించి Big Fish Media వారు ఎంతో చక్కగా చేస్తూ సినిమాకు మంచి బజ్ తీసుకొస్తున్నారు. ఇక త్వరలో విడుదల కానున్న ఈ సినిమా కోసం యువత ఆసక్తిగా ఎదురుచూస్తోంది.