Jawan Collection: బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టిన జవాన్, 2 రోజుల్లో 234 కోట్లు షేర్
షారుక్ జవాన్ మూవీ రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ₹200 కోట్ల క్లబ్‌లో చేరింది.
- Author : Balu J
Date : 09-09-2023 - 5:26 IST
Published By : Hashtagu Telugu Desk
Jawan Collection: షారూఖ్ ఖాన్ జవాన్ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరుగరాస్తోంది. మొదటి రోజు ఈ మూవీ భారతీయ బాక్సాఫీస్ వద్ద ₹127.50 కోట్లు వసూలు చేసిన తర్వాత యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ₹234.29 కోట్లు సాధించింది. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ₹109.24 రాబట్టింది. ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ట్విట్టర్ లో జవాన్ వరల్డ్ వైడ్ కలెక్షన్లను శనివారం పోస్ట్ చేశారు.
ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ₹200 కోట్ల క్లబ్‌లో చేరిందని ఆయన పేర్కొన్నారు. జవాన్ గురువారం ₹125.05 కోట్లు, శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ₹109.24 కోట్లు రాబట్టింది. ఆ విధంగా ప్రపంచవ్యాప్త కలెక్షన్ ప్రస్తుతం ₹234.29 కోట్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ బాలీవుడ్ సినిమాకైనా బిగ్గెస్ట్ వీకెండ్ స్కోర్ చేయడానికి సిద్ధంగా జవాన్ మూవీ నిరూపించిందని మనోబాల తెలిపారు.
లవ్, ఎమోషన్స్, అవినితీపై పోరాటం, దేశంలో రైతుల సమస్యలు, వాతావరణ కాలుష్యం, ఓటు విలువ లాంటి అంశాలను రంగరించి చేసిన మాస్, కమర్షియల్ సినిమా జవాన్. రజనీకాంత్ సినిమాలో మాదిరిగా లాజిక్కులు వెతకకుండా చూస్తే సినిమా మంచి అనుభూతిని అందిస్తుంది. సెంటిమెంట్, దేశభక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా సినిమాకు మరింత బలంగా మారింది. జవాన్ కు పోటీగా ఏ సినిమాలు కూడా లేకపోవడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
Also Read: Errabelli Dayakar Rao: పరిపాలనా సౌలభ్యం కోసమే పునర్ వ్యవస్థీకరణ: మంత్రి ఎర్రబెల్లి