Jani Master : బ్యాక్ టు వర్క్ అంటున్న జానీ మాస్టర్.. లేడీ అసిస్టెంట్ తో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్.. వీడియో వైరల్..
బెయిల్ పై బయటకు వచ్చాక ఒకే ఒక్క సినిమా ఈవెంట్ లో తప్ప ఎక్కడా కనిపించలేదు జానీ మాస్టర్.
- By News Desk Published Date - 10:28 AM, Mon - 2 December 24

Jani Master : ఇటీవల కొన్ని రోజుల క్రితం జానీ మాస్టర్ పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక ఆరోపణలు చేయడంతో జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసారు పోలీసులు. కొన్నాళ్ళు విచారణ, జైలులో ఉండి ఇటీవల బెయిల్ తో బయటకు వచ్చారు. బయటకు వచ్చిన దగ్గర్నుంచి సోషల్ మీడియాలో మళ్ళీ యాక్టివ్ అవుతూ, ఫ్యామిలీతో గడుపుతూ ఇదివరకులా హ్యాపీగా ఉండటానికి ట్రై చేస్తున్నాడు.
అయితే జానీ మాస్టర్ కు అవకాశాలు రావట్లేదని, టీవీ షోలకు కూడా పిలవట్లేదని ఈ విషయంలో బాధపడుతున్నారని తెలుస్తుంది. బెయిల్ పై బయటకు వచ్చాక ఒకే ఒక్క సినిమా ఈవెంట్ లో తప్ప ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలో మాత్రం వరుస పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఓ లేడీ డ్యాన్సర్ తో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని షేర్ చేసాడు జానీ మాస్టర్.
ఈ వీడియోలో.. ఇటీవల వరుణ్ ధావన్, కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ సినిమా నుంచి విడుదలైన నైన్ మటకా.. సాంగ్ కి స్టెప్పులు వేశారు. జానీ మాస్టర్, లేడీ డ్యాన్సర్ కలిసి ఆ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. బెయిల్ నుంచి బయటకు వచ్చాక ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ జానీ మాస్టర్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసినట్టు తెలుస్తుంది. ఈ వీడియోతో జానీ మాస్టర్ నేను వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను అనే సందేశం ఇండైరెక్ట్ గా ఇచ్చాడు. మరి ఇప్పటికైనా జానీ మాస్టర్ కి మళ్ళీ అవకాశాలు వస్తాయా చూడాలి. జానీ మాస్టర్ ఇదివరకులా ఫుల్ ఫామ్ లోకి వస్తారా చూడాలి.
Also Read : HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ లాస్ట్ షెడ్యూల్.. ఎక్కడ జరుగుతుందో తెలుసా?