Jai Bhim Star Lijo : ఆ సీన్లు చేస్తున్నంతసేపు ఏడుపు ఆపుకోలేకపోయేదాన్ని!
మట్టిలో తేమ ఉంది రెయికో వెన్నల ఉంది నమ్మితే రేపు నీది జీవితం సాగనుంది వెళ్లే దారుల్లో ఆకాశం తోడుంది హద్దే నీకొద్దు.. నీ నవ్వే వీడొద్దు... ఈ పదాలు వింటుంటే ‘జైభీమ్’ సినిమా కళ్ల ముందు కదలాడుతుంది కదా.
- By Balu J Published Date - 04:55 PM, Sat - 6 November 21

మట్టిలో తేమ ఉంది రెయికో వెన్నల ఉంది నమ్మితే రేపు నీది జీవితం సాగనుంది వెళ్లే దారుల్లో ఆకాశం తోడుంది హద్దే నీకొద్దు.. నీ నవ్వే వీడొద్దు… ఈ పదాలు వింటుంటే ‘జైభీమ్’ సినిమా కళ్ల ముందు కదలాడుతుంది కదా. హీరో సూర్య ప్రధాన ప్రాతలో నటించిన ఈ మూవీ అన్నివర్గాల వారిని ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో సూర్య నటన ఒక ఎత్తు అయితే, సినతల్లి పాత్రలో నటించిన హీరోయిన్ నటన మరొక ఎత్తు అని చెప్పక తప్పదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. ఫ్యామిలీ విలువలు, ఎమోషన్స్, కుటంబ సంబంధాలు, కట్టుబాట్లు ఎన్నో అంశాలు కట్టిపడేస్తాయి. ముఖ్యంగా సినతల్లి పాత్రలో నటించిన లిజో మోల్ జోస్ నటన సినిమాకు హైలైట్ నిలిచింది.
ఈ సందర్భంగా లిజో మాట్లాడుతూ ‘‘తాను పోషించిన పాత్ర నుంచి పూర్తిగా బయటపడలేకపోతున్నా. సినిమా చూస్తే నేను ఇంకా ఏడుస్తాను. ఎందుకంటే సినతల్లి భాదను అనుభవించాను. ఆ పాత్ర తాలుకూ మెమోరీస్ ఇప్పటికీ నాతో ఉన్నాయి. ఇప్పటివరకు, నేను పోషించిన ఏ పాత్ర కూడా నాపై ఇంతటి ప్రభావాన్ని చూపలేదు.
ఈ సినిమాల్లో కంటతడి పెట్టించే సీన్స్ ఎన్నో ఉన్నాయి. గ్లిజరిన్ లేకుండానే నటించాను. కెమెరాలో మీకు కనిపించే భావోద్వేగాలన్నీ నిజమైనవి. డైరెక్టర్ ‘కట్’ అని చెప్పిన తర్వాత కూడా, నేను ఏడుపు ఆపుకోలేకపోయాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. సినతల్లి భర్త రాజన్న మరణానికి సంబంధించిన సీన్స్, పోలీసులు చిత్రహింసలు పెట్టే సీన్స్ చేసేటప్పుడు అస్సలు గ్లిజరిన్ ఉపయోగించలేదని చెప్పుకొచ్చింది. ఆ సీన్లు చేస్తున్నంతసేపు కాళ్లలో నీళ్లు వచ్చేవని తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారు. తన గుండె బరువెక్కిందని ఆయన చెప్పారు’’ అని అంటోంది లిజో.
Related News

National Film Awards: జై భీమ్ కు దక్కని జాతీయ అవార్డు, జ్యూరీపై తమిళ్ ఫ్యాన్స్ ఫైర్
తమిళ్ హీరో సూర్య “జై భీమ్” సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఆ మూవీకి జాతీయ అవార్డ్ రాకపోవడం గమనార్హం.