Kevvu Kartheek : పెళ్లి చేసుకున్న జబర్దస్త్ నటుడు.. పలువురు సినీ, టీవీ సెలబ్రిటీల హాజరు..
ఇటీవల కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకోబోతున్నట్టు తాను చేసుకోబోయే అమ్మాయితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు కార్తిక్.
- By News Desk Published Date - 10:30 PM, Fri - 9 June 23

జబర్దస్త్(Jabardasth) కామెడీ(Comedy) షోతో మంచి పేరు తెచ్చుకున్నాడు కెవ్వు కార్తిక్(Kevvu Kartheek). మిమిక్రి ఆర్టిస్ట్(Mimicry Artist) గా తన ప్రయాణం మొదలుపెట్టి అనంతరం జబర్దస్త్ లో ఒక ఆర్టిస్ట్ గా వచ్చి టీం లీడర్ గా ఎదిగాడు. కెవ్వు కార్తీక్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలు షోలు, సినిమాలు, సీరియల్స్ లో కూడా నటించాడు. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు కెవ్వు కార్తీక్.
ఇటీవల కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకోబోతున్నట్టు తాను చేసుకోబోయే అమ్మాయితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు కార్తిక్. తాజాగా గురువారం జూన్ 8న కెవ్వు కార్తీక్ శ్రీలేఖ అనే అమ్మాయిని ఘనంగా వివాహం చేసుకున్నాడు. కార్తీక్ వివాహానికి పలువురు సినీ, టీవీ ప్రముఖులు హాజరయ్యారు. కార్తీక్ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రేక్షకులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు కార్తీక్ కి కంగ్రాట్స్ తెలుపుతున్నారు.
Also Read : Balakrishna : బాలయ్య సూపర్ హిట్ సినిమా ‘నరసింహనాయుడు’.. ఏకంగా 1000 థియేటర్స్ లో రీ రిలీజ్..