Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Interview Of Comedian Ali About F3

Ali Exclusive: ‘ఎఫ్‌ 3’ పక్కా ఫైసా వసూల్‌ మూవీ!

‘ఎఫ్‌ 3.. పక్కా ఫైసా వసూల్‌ మూవీ. వంద రూపాయలు పెట్టి సినిమా చూస్తే... మూడు వందల రూపాయల ఆనందం వస్తుంది’

  • By Balu J Updated On - 12:01 PM, Thu - 19 May 22
Ali Exclusive: ‘ఎఫ్‌ 3’ పక్కా ఫైసా వసూల్‌ మూవీ!

‘ఎఫ్‌ 3.. పక్కా ఫైసా వసూల్‌ మూవీ. వంద రూపాయలు పెట్టి సినిమా చూస్తే… మూడు వందల రూపాయల ఆనందం వస్తుంది’ అని ప్రముఖ కమెడియన్‌ అలీ అన్నారు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. దిల్ రాజు సమర్పణ లో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన అలీ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు..

స్టార్‌ ఇమేజ్‌ ఉంది. 43 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు? ఈ మధ్య కాలంలో మీ స్పీడ్‌ తగ్గింది. ఎందుకు?

బుల్లితెరపై ఒకే ఒక షో చేస్తున్నాను. అలాగే యమలీలా సీరియల్‌ చేశా. ఎస్వీ కృష్ణారెడ్డి గారి కోసమే ఆ సీరియల్‌ చేశా. ఎందుకంటే ఆయన నన్ను హీరో చేశాడు. స్టార్‌ దర్శకుడిగా ఉన్న ఆయన..అందరిని ఒప్పించి నాతో సినిమా చేశాడు. అందుకే ఆయన ఏం చెప్పినా.. వెనక ముందు ఆలోచించకుండా చేసేస్తా. ఇక ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాల్లో మాకు క్యారెక్టర్‌ ఇస్తున్నారు. సినిమా కథ ఏంటో మాకు చెప్పరు. తీరా సినిమా చూస్తుంటే..అలీగారు ఎందుకు ఈసినిమాలో నటించాడు? అని అందరు అనుకుంటారు. అభిమానులతో ఆ మాట అనిపించుకోవద్దనే కొన్ని సినిమాలు చేయడంలేదు. కథ విని నా క్యారెక్టర్‌ బాగుంటేనే సినిమా చేస్తా. కొత్త వాళ్లకు అయితే ఏదైనా పర్లేదు అని చేస్తారు. నాకు ఇప్పుడు ఆ అవసరం లేదు.

ఎఫ్‌3లో పూర్వ అలీగారిని చూడగలమా?

తప్పకుండా చూస్తారు. నా క్యారెక్టర్‌లో అంత సత్తా ఉంది. లొకేషన్‌లో కూడా టెక్నీషయన్స్‌ బాగా ఎంజాయ్‌ చేశారు. శిరీష్‌ గారు అయితే 35 సార్లు చూసి కిందపడి మరీ నవ్వారని అనిల్‌ చెప్పారు. నా పాత్రను ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు.

ఎఫ్‌3లో మీ క్యారెక్టర్‌ పేరు?

పాల బేబీ. వడ్డీకి తిప్పే క్యారెక్టర్‌ నాది. ఆడవాళ్లు అంటే అపారమైన గౌరవం.. సినిమా ఎండింగ్‌లో మీకు ఆ విషయం తెలుస్తుంది9(నవ్వుతూ..). సినిమా మొత్తంలో 45 నిమిషాలకు పైగా నా పాత్ర ఉంటుంది.

సినిమాలో చాలా క్యారెక్టర్స్‌ ఉన్నారు. చాలా మంది ఆరిస్టులు నటించారు. ఎవరెలా చేశారు?

ఒకరిని మించి ఒకరు నటించారు. ఎవ్వరిని తగ్గించలేం. చిన్న క్యారెక్టర్‌ కూడా సినిమాలో కీలకం. ‘కొన్ని సీన్స్‌ మిస్‌ అయిపోయామే.. మళ్లీ వెళ్లాలిరా’ అనేలా ఆడియన్స్‌ థియేటర్లకు వస్తారు.

వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ కామెడీ టైమింగ్‌ గురించి?

వాళ్లు పుట్టిందే ఇండస్ట్రీలో. ఇద్దరు బాగా చేశారు. వారితో పాటు మిగతా నటీనటులు కూడా చక్కగా నటించారు.

సినిమాల్లో హీరోలిద్దరికి ఓ లోపం ఉంది.వెంకటేశ్‌కు రేచీకటి అయితే.. వరుణ్‌కు నత్తి.. మరి మీకేముంది?

నాకు గన్‌ ఉందిగా(నవ్వుతూ..)

అనిల్‌తో వర్క్‌ చేయడం ఎలా అనిపించింది?

సినిమాలో ఇంత మంది ఆర్టిస్టులు ఉంటే కొంచెం టెన్షన్‌ ఉంటుంది. కానీ అనిల్‌లో అది కొంచెం కూడా కనిపించదు. అందరు వచ్చారా? టిఫిన్‌ చేశారా? ఓకే షూటింగ్‌ స్టార్ట్‌ చేద్దాం అని సింపుల్‌గా అనేస్తాడు. అతి తక్కువ వయసులో ఇంతమంది ఆర్టిస్టులను మేంటేన్‌ చేయడం అనేది గొప్ప విషయం. ఒకప్పుడు రాఘవేంద్రరావు, ఈవీవీ సత్యనారాయణ, దాసరి నారాయణరావు సినిమాల్లో ఇలాంటి వాతావరణం ఉండేది. అనిల్‌లో అంత సత్తా ఉంది కాబట్టే.. దిల్‌ రాజు గారు కూడా ఎంత మంది ఆర్టిస్టులు కావాలంటే.. అంతమందిని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇలాంటి నిర్మాత దొరకడం అనిల్‌ అదృష్టం.

వెంకటేశ్‌తో మీ కామెడీ టైమింగ్‌ ఎలా ఉండబోతుంది?

ఆయనతో నేను చేసినా సినిమాలు అన్ని కామెడీ చిత్రాలే. కామెడీ చేయడంలో చిరంజీవి, వెంకటేశ్‌, మోహన్‌బాబు, పవన్‌ కల్యాణ్‌, ఎన్టీఆర్‌, మహేశ్‌బాబు ఎక్స్‌ఫర్ట్స్

పొలిటికల్‌ కెరీర్‌ గురించి?

నన్ను హీరోగా క్రియేట్‌ చేసింది ఎస్వీ కృష్ణారెడ్డి అయితే..పొలిటికల్‌ లీడర్‌గా క్రియేట్‌ చేయబోతున్నది సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారే.ఆయన నాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. నామీద నమ్మకం పెట్టుకోండి అన్నారు అంతే. ఏదో ఒకరోజు కాల్‌ వస్తే వెళ్తా.. మీ సమక్షంలోనే(మీడియా) ఆ విషయాన్ని పంచుకుంటా(నవ్వుతూ..)

ఫైనల్‌గా ఎఫ్‌3 గురించి ఏం చెప్తారు?

ఇది ఒక అద్భుతమైన సినిమా. ఫైసా వసూల్‌ మూవీ. వంద రూపాయలు పెట్టి సినిమా చూస్తే… మూడు వందల రూపాయల ఆనందం వస్తుంది.

కొత్త సినిమాల గురించి?

అంటేసుందరానికి, ఎఫ్‌3, లైగర్‌, ఖుషీ, ఒకే ఒక జీవితం సినిమాలతో పాటు తమిళ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నా. కన్నడలో ధృవ సర్జా మూవీలో నటిస్తున్నాను. ఓ నేపాలి సినిమాలో కూడా యాక్ట్‌ చేస్తున్నా. ఒప్పుడు మనం సినిమాల్లో అవకాశం కోసం వెళ్లేవాళ్లం. ఇప్పుడు వాళ్లే మన దగ్గరకు వస్తున్నారు. ఒకప్పుడు నార్త్‌వాళ్లను మనం తెచ్చుకునేవాళ్లం. మనం యాక్టింగ్‌ నేర్పించి, డబ్బింగ్‌ చెప్పించి డబ్బులు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు సౌత్‌ వాళ్ల సత్తా ఏంటో తెలిసింది. అక్కడి సినిమాల కోసం మమల్ని పిలుస్తున్నారు.

Tags  

  • Ali
  • Exclusive
  • interview
  • latest tollywood news

Related News

Raashi khanna: ఏంజిల్ ఆర్నా కంటే లాయర్ ఝాన్సీ కేరక్టర్ కి మంచి స్కోప్ ఉంది!

Raashi khanna: ఏంజిల్ ఆర్నా కంటే లాయర్ ఝాన్సీ కేరక్టర్ కి మంచి స్కోప్ ఉంది!

మ్యాచో స్టార్ గోపీచంద్‌, అందాల బ్యూటీ రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్.

  • Ramarao On Duty: మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించేలా ‘నా పేరు సీసా’

    Ramarao On Duty: మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించేలా ‘నా పేరు సీసా’

  • Nani Look: నాని టెర్రిఫిక్ అవతార్.. దసరా షూటింగ్ స్టార్ట్!

    Nani Look: నాని టెర్రిఫిక్ అవతార్.. దసరా షూటింగ్ స్టార్ట్!

  • Pawan Kalyan & Sai Dharam Tej: మెగా మల్టీస్టారర్.. పవన్ కళ్యాణ్ తో సాయితేజ్!

    Pawan Kalyan & Sai Dharam Tej: మెగా మల్టీస్టారర్.. పవన్ కళ్యాణ్ తో సాయితేజ్!

  • Prabhas: నో ఓటీటీ, ఓన్లీ థియేటర్స్.. డిజిటల్ స్ట్రీమింగ్ పై ప్రభాస్ కామెంట్స్!

    Prabhas: నో ఓటీటీ, ఓన్లీ థియేటర్స్.. డిజిటల్ స్ట్రీమింగ్ పై ప్రభాస్ కామెంట్స్!

Latest News

  • India Warm Up Match: రెండో వార్మప్ మ్యాచ్ లోనూ భారత్ విజయం

  • Ind Vs Eng: బెయిర్ స్టో రికార్డుల జోరు

  • Congress : నేడు సంచలన నిర్ణయం ప్ర‌క‌టించ‌నున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • Maharashtra : నేడు మ‌హారాష్ట్ర అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌

  • Gym: ఇంటర్నెట్లో క్లిక్ కొట్టు.. ఇంట్లోనే ఫిట్నెస్ పై పట్టు!!

Trending

    • Viral Video : మొసలితో మేయర్ మ్యారేజ్!

    • Viral video : కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో రిక్షావాలా.. కొత్త చెప్పులిచ్చిన కానిస్టేబుల్ !

    • BJP Then and Now: 2004లోనూ హైదరాబాద్ లోనే బీజేపీ సమావేశాలు.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి?

    • Clouds on Mars: మార్స్ పైన మేఘాలని కనిపెట్టండి.. నాసా పోస్ట్ వైరల్!

    • Alimony: హింసించిన భార్య.. 83 ఏళ్ళ భర్తకు భార్య భరణం ఇవ్వాలంటూ కోర్టు తీర్పు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: