Raviteja : మాస్ రాజా కోహినూర్ అవుతున్నాడా..?
మాస్ మహరాజ్ రవితేజ కి పర్ఫెక్ట్ యాప్ట్ టైటిల్ ని ఫిక్స్ చేశారట చిత్ర యూనిట్. ఇంతకీ ఆ టైటిల్ ఏంటి అంటే
- By Ramesh Published Date - 04:15 PM, Sat - 10 August 24

మాస్ మహరాజ్ రవితేజ ఓ పక్క మిస్టర్ బచ్చన్ రిలీజ్ కు రెడీ అవుతుండగానే తన నెక్స్ట్ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో రవిఏజ కన్నా ఎక్కువ డైరెక్టర్ హరీష్ శంకర్ కనిపిస్తున్నాడు. దీనికి కారణం రవితేజ భాను బోగవరపు డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుండటమే అని తెలుస్తుంది. మిస్టర్ బచ్చన్ కు తన పని పూర్తి చేసి మరో సినిమా చేస్తున్నాడు రవితేజ. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా సరే సినిమా వెంట సినిమా చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు రవితేజ.
మిస్టర్ బచ్చన్ తో ఎలాగు సూపర్ హిట్ కొట్టేలా ఉన్న మాస్ రాజా తన నెక్స్ట్ సినిమా విషయంలో అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నారని తెలుస్తుంది. రవితేజ భాను కాంబోలో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ లాక్ చేసినట్టు తెలుస్తుంది. మాస్ మహరాజ్ రవితేజ కి పర్ఫెక్ట్ యాప్ట్ టైటిల్ ని ఫిక్స్ చేశారట చిత్ర యూనిట్. ఇంతకీ ఆ టైటిల్ ఏంటి అంటే కోహినూర్ అని తెలుస్తుంది. కొహినూర్ అనగానే మెరిసిపోయే వజ్రం గుర్తుకొస్తుంది.
అందరికీ తెలిసిన.. అందరు మెచ్చే టైటిల్ ని రవితేజ (Raviteja) లాక్ చేసుకున్నారు. ధమాకా తర్వాత సీరియస్ కథలతో వచ్చినా పెద్దగా సందడి చేయలేని మాస్ రాజా తన మార్క్ మాస్ అండ్ ఎంటర్టైనింగ్ కథలతోనే మళ్లీ వస్తున్నాడని తెలుస్తుంది. ఐతే మిస్టర్ బచ్చన్ బాలీవుడ్ సినిమా రైడ్ కథతో పూర్తిగా డిఫరెంట్ నారేషన్ తో వస్తుంది.
మరి రవితేజ కొహినూర్ (Kohinoor) ఎలా ఉంటుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లాన్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. ఇద్దరు కలిసి ఆల్రెడీ ధమాకాతో సూపర్ హిట్ అందుకున్నారు.
Also Read : Murari Rerelease : మురారి రీ రిలీజ్.. ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్..!