Bigg Boss7: బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న క్రికెటర్
చిన్న షోగా మొదలై టిఆర్పి రేటింగ్స్ లో సంచనాలు సృష్టించిన బిగ్ బాస్ షో సీజన్ 7 మొదలుకాబోతుంది. ఈ సారి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సన్నాహాలు చేస్తున్నారు నిర్వాహకులు
- By Praveen Aluthuru Published Date - 02:25 PM, Wed - 19 July 23

Bigg Boss7: చిన్న షోగా మొదలై టిఆర్పి రేటింగ్స్ లో సంచనాలు సృష్టించిన బిగ్ బాస్ షో సీజన్ 7 మొదలుకాబోతుంది. ఈ సారి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సన్నాహాలు చేస్తున్నారు నిర్వాహకులు. అందులో భాగంగా ఈ సీజన్లో ప్రముఖ క్రికెటర్ని తీసుకోవాలని అనుకుంటున్నారట. గడిచిన 6 సీజన్లలో సినిమా, యూట్యూబ్ స్టార్స్ ని మాత్రమే చూశాం. కానీ ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌజ్ లో క్రికెటర్ అలరించనున్నాడని తెలుస్తుంది. మన తెలుగు కుర్రాడు విశాఖపట్నానికి చెందిన వేణుగోపాల్ రావు ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడనే టాక్ నడుస్తుంది.
వేణుగోపాల్ రావు 2005 లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా భారత తరఫున అరంగేట్రం చేశాడు. అయితే 14 ఏళ్ల తర్వాత అన్ని ఫార్మేట్లకి రిటైర్మెంట్ ప్రకటించాడు. వేణుగోపాల్ రావు డెక్కన్ ఛార్జర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, సన్ రైజర్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ లో వేణు దాదాపుగా 65 మ్యాచ్ లు ఆడి ఇప్పుడు కామెంటేటర్ గా కొనసాగుతున్నాడు.
Read More: Delhi Secret : చంద్రబాబుకు NDA ఆహ్వానం లేకపోవడం వెనుక కారణమిదే.!