Bumper Offer: అది నిరూపిస్తే రూ.కోటి బహుమతి.. ఆ సినిమా టీమ్‌కు బంపర్ ఆఫర్
ది కేరళ స్టోరీ సినిమా వివాదాస్పదంగా మారుతుంది. విడుదలకు ముందే ఈ సినిమా కాంట్రవర్సికి దారితీసింది. ప్రస్తుతం ఈ సినిమాపై సోషల్ మీడియాతో పాటు బయట కూడా వివాదాస్పద చర్చ జరుగుతోంది.
- By Anshu Published Date - 07:44 PM, Mon - 1 May 23

Bumper Offer: ది కేరళ స్టోరీ సినిమా వివాదాస్పదంగా మారుతుంది. విడుదలకు ముందే ఈ సినిమా కాంట్రవర్సికి దారితీసింది. ప్రస్తుతం ఈ సినిమాపై సోషల్ మీడియాతో పాటు బయట కూడా వివాదాస్పద చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ఈ సినిమాకు వ్యతిరేకంగా కేరళలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 32 వేల మంది బాలికలను లవ్ జిహాద్ ద్వారా ఇస్లాం మతంలోకి మార్చుకుని సిరియాకు తరలించారని ఈ సినిమాలో ఆరోపించారు. ఈ సినిమా వేదికగా రాజకీయ యుద్దం నడుస్తోంది.
అయితే ఈ సినిమాపై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ యువజన విభాగం ముస్లిం యూత్ లీగ్ స్పందించింది. ఈ మేరకు చిత్ర బృందానికి ఆ సంఘం ఓ సవాల్ విసిరింది. 32 వేల మంది బాలికలను లవ్ జిహాదీ ద్వారా ఇస్లాం మతంలోకి మార్చి సిరియాకు పంపించినట్లు నిరూపిప్తే కోటి బహుమతి ఇస్తామంటూ ప్రకటించింది. ఈ మేరకు యూత్ లీగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీకే ఫిరోస్ తెలిపారు. ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే జిల్లా కేంద్రాల్లోని తమ లీగ్ కౌంటర్లలో సమర్పించి రివార్డు పొందవచ్చని తెప్పారు.
ఇక ఈ వివాదాస్పద సినిమాపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. విద్వేషాన్ని వ్యాప్తి చేయడమే లక్ష్యంగా సినిమా ఉందని ఆరోపించారు. సంఘ్ వారివార్ ఈ సినిమా వెనుక ఉందని, సంఘ్ పరిావర్ ఓ అబద్ధా ఫ్యాక్టరీ అని విమర్శించారు. ద్వేషపూరిత ప్రచారం ద్వారా కేరళ ఎన్నికలను లక్ష్యంగా చేసుకునేలా సినిమా ఉందని అన్నారు. దేశంలో వివిధ దర్యాప్తు సంస్థలు లవ్ జిహాదీ ఆరోపణలను నిరూపించలేకపోయాయని చెప్పారు.
అయితే ఆదా శర్మ నటించిన కేరళ స్టోరీ సినిమాను సుదీప్తో సేవ్ రచన దర్శకత్వం వహించారు. మే 5న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకూడదని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.