Anand Devarakonda : వివాహ వ్యవస్థపై నాకు చాలా నమ్మకం ఉంది!
ఆనంద దేవరకొండ హీరోగా విజయ్ దేవరకొండ తన సొంత బ్యానర్లో 'పుష్పక విమానం' సినిమాను నిర్మించాడు. గీత్ శైని - శాన్వి మేఘన కథానాయికలుగా నటించిన ఈ సినిమా ద్వారా దర్శకుడిగా దామోదర పరిచయమవుతున్నాడు.
- By Balu J Published Date - 02:18 PM, Mon - 8 November 21
![Anand Devarakonda : వివాహ వ్యవస్థపై నాకు చాలా నమ్మకం ఉంది!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2021/11/hash-4.f.jpg)
ఆనంద దేవరకొండ హీరోగా విజయ్ దేవరకొండ తన సొంత బ్యానర్లో ‘పుష్పక విమానం’ సినిమాను నిర్మించాడు. గీత్ శైని – శాన్వి మేఘన కథానాయికలుగా నటించిన ఈ సినిమా ద్వారా దర్శకుడిగా దామోదర పరిచయమవుతున్నాడు. ఈ మూవీ సంబంధాలు, వివాహాల చుట్టూ తిరుగుతుంది. ఈ నెల 12న విడుదల కానున్న ఈ మూవీ గురించి హీరో ఆనంద్ చెప్పిన విశేషాలు మీకోసం..
మొదటిసారి ఓ గవర్నమెంట్ టీచర్ లో పాత్రలో నటించా. నా క్యారెక్టర్ పేరు సుందరం. చాలా పద్ధతిగా, గౌవరంగా ఉంటుంది. అలాంటి వ్యక్తికి పెళ్లవుతుంది. అయితే పద్ధతిగా ఉండే భర్తను పెళ్లం ఎందుకు విడిచిపెట్టింది? ఎవరితో పారిపోయింది? అనే విషయాలు చాలా సరాదాగా ఉంటాయి.
ఇలాంటి సినిమాలు తెలుగు సినిమాలో చాలా అరుదుగా వస్తాయి. హీరో క్యారెక్టర్, స్టోరీ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఈ సినిమాకు సైన్ చేశా. సినిమా మొత్తం నవ్వుతూనే చేశా. దర్శకుడు దామోదర్ ప్రయోగాత్మకమైన వ్యక్తి. కొత్త విషయాలను ప్రయత్నించడంలో ముందుంటాడు. నేను వివాహ సంస్థను నమ్ముతా. నాకు పెళ్లి వయసు వచ్చేసరికి, నా స్నేహితులు, బంధువులు పెళ్లి చేసుకోవడం చూశాను. పెళ్లి తర్వాత చాలా త్వరగా బ్రేకప్‌ల గురించి కూడా వింటున్నాను. కానీ రెండు దశాబ్దాల క్రితం అలా ఉండేది కాదు. అందుకే వివాహ వ్యవస్థపై సరాదాగా సినిమాల తీయాలని ప్రయత్నించాం.
మొదట మా నాన్నగారు స్క్రిప్ట్ విన్నారు. తర్వాత నేను, ఆ తర్వాత విజయ్ కూడా నా కోసం ఎక్సైట్ అయ్యారు. అందుకే సొంత బ్యానర్ లో తీనిమా తీశాం. ఓ సినిమా నిర్మాణం ఎన్ని సవాళ్లతో కూడుకుందో మొదటిసారి తెలుసుకున్న. నా బ్రదర్ విజయ్ ఇప్పటికే మంచి నటుడు అని నరూపించుకున్నాడు. అతని సినిమా జర్నీ చాలా బాగుంది. కథల విషయంలో విజయ్ ఇన్వాల్వ్ మెంట్ చాలా తక్కువ. నాకు నేనుగా స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటున్నా.
సినిమా నిర్మాతలలో మా డాడీ ఒకరు. ఆయన ఇక్కడికి రాలేదు. ఇంట్లో టీవీలో ఇప్పుడు ఈ ఈవెంట్ చూస్తుంటాడు. ఆయన హీరో అవ్వాలనే ఉద్దేశంతో ఎర్రబస్సు ఎక్కి ఇక్కడికి వచ్చాడు. కానీ కొన్ని కారణాల వలన కాలేకపోయాడు. ఇప్పుడు మా అన్నయ్య .. నేను ఇద్దరం హీరోలమై ఆయన కోరికను నెరవేర్చినందుకు గర్వంగా ఉంది.
Related News
![Hero Nikhil: హీరో నిఖిల్ చేతుల మీదుగా రాజా రవీంద్ర ‘సారంగదరియా’ ట్రైలర్ రిలీజ్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/nikhil.jpg)
Hero Nikhil: హీరో నిఖిల్ చేతుల మీదుగా రాజా రవీంద్ర ‘సారంగదరియా’ ట్రైలర్ రిలీజ్
Hero Nikhil: కులం రక్తం మీద ఆధారపడి ఉండదు.. అది పుట్టుకతోనే వస్తుంది… కులం అనేది మనం జీవితంలో చేసే పనులపై ఆధారపడి ఉంటుంది.’, ‘జీవితంలో అతి పెద్ద వ్యసనం మద్యం, సిగరెట్లు, బెట్టింగ్ కాదు. అతి పెద్ద వ్యసనం ఒక వైఫల్యం. మనకు తెలియకుండానే మన జీవితంలో ఉన్న వాటితో రాజీపడేలా చేస్తుంది. వైఫల్యం మనల్ని దేనికీ అనర్హులమని నిర్దేశిస్తుంది, బాస్ లాగా మనల్ని నియంత్రిస్తుంది…’, ‘ఇక్కడ ప�