Tollywood : హీరో గోపీచంద్..సదా విషయంలో వదలేయమన్న డైరెక్టర్ తేజ వదల్లేదట..
ఇది నాకు కాబోయే పెళ్ళాం అంటూ… నాలుకతో బుగ్గ నాకుతాడు. చూడటానికి కొంచెం జుగుప్సాకరంగా ఆ సీన్ ఉంటుంది
- By Sudheer Published Date - 11:49 AM, Wed - 20 September 23

జయం (Jayam) ఫేమ్ సదా (Sada)..జయం సినిమాతో ఇండస్ట్రీ కి పరిచమైన సంగతి తెలిసిందే. అలాగే హీరో నితిన్ (Nithin) సైతం ఇదే మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వీరిద్దరి కెరియర్ లోనే జయం..గొప్ప విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత నితిన్ యూత్ స్టార్ గా మారాడు. అలాగే సదా కూడా వరుస సినిమాలతో బిజీ అయ్యింది. కాగా ఈ సినిమా తాలూకా విశేషాలు తాజాగా సదా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ లో డైరెక్టర్ తేజ (Director Teja) వల్ల ఎంత ఇబ్బంది పడిందో తెలిపి షాక్ ఇచ్చింది.
ఈ సినిమాలో హీరో నితిన్ ని సదా రహస్యంగా గుడి వెనుక కలుస్తుంది. వీళ్ళ ప్లాన్ ముందుగానే పసిగట్టిన విలన్ గోపీచంద్ (Gopichand) ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. నితిన్ ని చితకబాదుతూ సదాను వేదనకు గురి చేస్తాడు. ఈ సీన్లో గోపీచంద్ ఇది నాకు కాబోయే పెళ్ళాం అంటూ… నాలుకతో బుగ్గ నాకుతాడు. చూడటానికి కొంచెం జుగుప్సాకరంగా ఆ సీన్ ఉంటుంది. కాగా సదా ఈ సన్నివేశం చేసేందుకు అస్సలు ఒప్పుకోలేదట. తాను ఆ సన్నివేశం చేయనని ముందుగానే చెప్పిందట. షూటింగ్ సమయంలో మాత్రం చేయాల్సిందే, ఇది సినిమాకు హైలెట్ అవుతుందని డైరెక్టర్ తేజ పట్టుపట్టాడట. చివరికి గోపీచంద్ సైతం వదిలేయండి సార్… అని తేజ ను అన్నాకాని వినలేదట. పైగా గోపీచంద్ మీద కోప్పడ్డాట తేజ.
Read Also : ANR Statue: అన్నపూర్ణ స్టూడియో లో ANR విగ్రహావిష్కరణ..తరలివచ్చిన సినీ , రాజకీయ ప్రముఖులు
డెబ్యూ మూవీ కావడంతో సదా కూడా పెద్దగా చెప్పలేకపోయిందట. ఆ సీన్ ఎందుకు చేశానా అని ఇప్పటికీ బాధపడతాను. ఇంటికి వెళ్లి ఏడ్చేశాను. ముఖాన్ని పదే పదే కడుక్కున్నాను. ఇప్పుడు కూడా ఆ సీన్ టీవీలో వస్తే ఆ దరిదాపుల్లో లేకుండా వెళ్ళిపోతాను… అని సదా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.
తనకు మొదటి సక్సెస్ ఇచ్చిన దర్శకుడు, సినిమా గురించి సదా ఇలా కామెంట్స్ చేయడం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం సదా అహింస చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మరోపక్క బుల్లితెర డాన్స్ రియాలిటీ షోలలో సదా జడ్జిగా వ్యవహరిస్తోంది.