Nitya Menon : నిత్యా మీనన్ ని ప్రోత్సహిస్తున్న హీరో.. ఎంతైనా హిట్ కాంబో కదా మరి..!
Nitya Menon నితిన్ హీరోగా నటించిన ఇష్క్, గుండెజారి గల్లతయ్యిందే సినిమాలతో తెలుగులో మంచి సక్సెస్ అందుకున్న నిత్యా మీనన్ ఆ తర్వాత కూడా తన మార్క్
- By Ramesh Published Date - 12:23 PM, Sat - 15 June 24

Nitya Menon నితిన్ హీరోగా నటించిన ఇష్క్, గుండెజారి గల్లతయ్యిందే సినిమాలతో తెలుగులో మంచి సక్సెస్ అందుకున్న నిత్యా మీనన్ ఆ తర్వాత కూడా తన మార్క్ చూపించింది కానీ ఇక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకోవడంలో విఫలమైంది. మహానటి సినిమా ఆఫర్ ముందు నిత్యాకే రాగా ఆమె కాదనడం వల్ల కీర్తి సురేష్ కి వెళ్లింది. నిత్యా మీనన్ మహానటి చేసుంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పొచ్చు.
ఇక ఈమధ్య తెలుగులో పెద్దగా కనిపించని నిత్యా మీనన్ అడపాదడపా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తుంది. ఐతే కోలీవుడ్ లో మాత్రం వరుస ఆఫర్లు అందుకుంటుంది అమ్మడు. ఇదిలాఉంటే నిత్యా మీనన్ లేటెస్ట్ గా ఒక తెలుగు సినిమా ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తుంది. తనకు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన నితిన్ తోనే మళ్లీ నిత్యా స్క్రీన్ షేర్ చేసుకుంటుందని తెలుస్తుంది.
నితిన్ హీరోగా వేణు శ్రీరాం డైరెక్షన్ లో వస్తున్న సినిమా తమ్ముడు. ఈ సినిమాలో లయ ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ గా వర్ష బొల్లమ్మ నటిస్తుంది. వర్షతో పాటుగా నిత్యా మీనన్ కూడా సర్ ప్రైజ్ చేస్తుందని టాక్. మరి నిత్యా ఆఫ్టర్ లాంగ్ టైం తెలుగులో చేస్తున్న తమ్ముడు ఆమెకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
Also Read : Allu Arjun Pushpa 2 : పుష్ప 2 కి మెగా ఫ్యాన్స్ షాక్ తప్పదా..?