Harish Shankar : ‘బచ్చన్ ‘ ప్లాప్ తో హరీష్ శంకర్ తన రెమ్యూనరేషన్ వెనక్కు ఇచ్చాడా..?
ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకుడిగా రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇందులో నుంచే నిర్మాతకు రూ.2 కోట్లు తిరిగి ఇచ్చినట్లు టాక్
- By Sudheer Published Date - 04:19 PM, Wed - 4 September 24

మిస్టర్ బచ్చన్ (Mister Bachchan) ప్లాప్ అయ్యేసరికి డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) తన రెమ్యూనరేషన్ (Remuneration ) ను వెనక్కు ఇచ్చాడా..? ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. షాక్ తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన హరీష్..మొదటి సినిమాతోనే షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత మిరపకాయ్ , గబ్బర్ సింగ్ చిత్రాలతో మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. హరీష్ నుండి సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అని భావిస్తుంటారు. అలాంటి హరీష్..తాజాగా మిస్టర్ బచ్చన్ తో భారీ ప్లాప్ ఇచ్చాడు. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ..మొదటి రోజు మొదటి ఆట తోనే ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా రిలీజ్ కు ముందు సినిమా అబ్బో..మాములుగా ఉండదు..కొత్త రవితేజ ను చూస్తారు అంటూ గొప్పలు చెప్పాడు..తీరా సినిమా విడుదలయ్యాక అసలు సినిమా లో ఏముంది అనేది బయటపడింది. రవితేజ అభిమానులైతే హరీష్ ఫై ఓ రేంజ్ లో ట్రోల్ చేసారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ కనీసం రూ.10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. దీంతో నిర్మాతలకు , డిస్ట్రబ్యూటర్స్ కు భారీ నష్టాలు వాటిల్లాయి. ఈ నష్టాలను పూడ్చేందుకు హరీష్ తన రెమ్యూనరేషన్లోని రెండు కోట్లను తిరిగి నిర్మాతకు ఇచ్చాడనే వార్తలు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకుడిగా రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇందులో నుంచే నిర్మాతకు రూ.2 కోట్లు తిరిగి ఇచ్చినట్లు టాక్. అయితే హరీశ్ శంకర్ చేసిన పనికి రవితేజ అభిమానులతో పాటు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది.
Read Also : Ys Jagan Visit Vijayawada: విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన