HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Hariharaveeramallu Premier Collections

HHVM : హరి హర వీరమల్లు ప్రీమియ‌ర్స్‌ కలెక్ష‌న్స్ ఎంతంటే !!

HHVM : ఈ నేపథ్యంలో ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ప్రీమియర్ షోలు ద్వారా ఈ చిత్రం రూ.20–25 కోట్ల మధ్య వసూళ్లు సాధించినట్లు సమాచారం.

  • Author : Sudheer Date : 24-07-2025 - 11:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hhvm Collections
Hhvm Collections

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu ) జూలై 24న గ్రాండ్ రిలీజ్ అయింది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం సమర్పణలో వచ్చిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాకు తొలుత క్రిష్ దర్శకత్వం వహించగా, మధ్యలో ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో దర్శక బాధ్యతలు ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ చేపట్టారు. 16వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం, కోహినూర్ వజ్రం నేపథ్యంగా సాగిన ఈ చిత్రం పవన్ అభిమానులకు ఒక రకమైన చారిత్రక విజ్ఞానాన్ని కలగజేస్తూ, యాక్షన్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలకు తెరలేవగా, భారీ స్పందన కనిపించింది. కొన్ని థియేటర్లలో టిక్కెట్ ధరలు రూ.600 వరకు పెరిగినా అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ప్రీమియర్ షోలు ద్వారా ఈ చిత్రం రూ.20–25 కోట్ల మధ్య వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఈ మొత్తం పవన్ కెరీర్‌లోనే అత్యధిక ప్రీమియర్ కలెక్షన్‌గా నిలవొచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. సినిమాపై వచ్చిన భారీ స్పందనను గమనించి చిత్ర బృందం కూడా థియేటర్లు హౌస్‌ఫుల్ కావడాన్ని సానుకూల సంకేతంగా పేర్కొంది.

Rajeev Kanakala: సినీ నటుడు రాజీవ్ కనకాలకు పోలీసుల నోటీసులు

పవన్ కళ్యాణ్ పోషించిన వీరమల్లు పాత్ర అభిమానులకు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ ఎపిసోడ్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నిధి అగర్వాల్ తన గ్లామర్‌తో పాటు నటనతో కూడా ఆకర్షించింది. బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో మోస్తరు ప్రభావం చూపాడు. ఈ సినిమా ద్వారా పవన్ మళ్లీ పాన్ ఇండియా హీరోగా ఫోకస్‌లోకి వస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. ఇప్పటివరకు ఆయన రూ.100 కోట్ల క్లబ్‌లో చేరకపోయినా, ఈ సినిమా ఆ అవకాశాన్ని కల్పించవచ్చని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, సినిమా విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో హిట్, ఫ్లాప్ వాదనలు మొదలయ్యాయి. కొందరు సినిమాలోని విజువల్స్, పవన్ నటనపై ప్రశంసలు కురిపిస్తుండగా, మరికొందరు కథ నెమ్మదిగా సాగుతుందని విమర్శిస్తున్నారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు నుండి భారీ ఓపెనింగ్స్ లభించాయి. అయితే దీర్ఘకాలికంగా ఇది కమర్షియల్ విజయాన్ని సాధిస్తుందా లేదా అన్నది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది. అయినా ఈ ప్రీమియర్ వసూళ్లతోనే పవన్ మార్కెట్‌లో ఉన్న క్రేజ్‌ను మరోసారి నిరూపించుకున్నాడని చెప్పొచ్చు.

Bhadrakali : విజయ్ అంటోనీ ‘భద్రకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hariharaveeramallu
  • hariharaveeramallu Collections
  • hariharaveeramallu Premier Collections
  • hariharaveeramallu Premier shows
  • Pawan Kalyan

Related News

Nani Pawan

Nani Big Shock to Pawan Kalyan : నాని మాస్ ‘షేర్’ దెబ్బకు పవన్ ‘ఉస్తాద్’ విలవిల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" చిత్రం నుండి విడుదలైన 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పాటపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

  • Allu Sirish Wedding

    అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. పవన్ కళ్యాణ్ దంపతులకు ఆహ్వానం!

  • Allu Sirish invites Pawan Kalyan and Naga Babu

    అల్లు శిరీష్ పెళ్లి..పవన్‌ కల్యాణ్‌, నాగబాబులకు శుభలేఖ

  • Konidela Village

    కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

Latest News

  • Vijay- Rashmika Assets : వామ్మో.. విజయ్ దేవరకొండ ఆస్తులతో సమానంగా రష్మిక ఆస్తులు ! గట్టిగానే సంపాదించింది !!

  • Prabhas : నిర్మాతలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ప్రభాస్!

  • TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..ప్రభుత్వానికి కార్మికులు డెడ్ లైన్ !!

  • Firing : తనని కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని వధువుని కాల్చి చంపిన ప్రేమికుడు

  • Hyderabad : హైదరాబాద్‌లోని పేదలకు గుడ్‌న్యూస్

Trending News

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd