HariHara Veeramallu : హరిహర వీరమల్లు అప్డేట్.. 500 మందితో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్..
హరిహర వీరమల్లు కొంతభాగం షూట్ అవ్వగా తాజాగా మళ్ళీ షూట్ మొదలుపెట్టారు.
- Author : News Desk
Date : 16-08-2024 - 12:58 IST
Published By : Hashtagu Telugu Desk
HariHara Veeramallu : పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో చేతిలో ఉన్న మూడు సినిమాలు ప్రస్తుతం హోల్డ్ లో పెట్టారు. పవన్ త్వరలో డేట్స్ ఇచ్చి వాటిని పూర్తిచేస్తానని ఇటీవల తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ మొదటిసారి చేస్తున్న పీరియాడిక్ యాక్షన్ సినిమా హరిహర వీరమల్లు ఎప్పట్నుంచో సాగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొంతభాగం షూట్ అవ్వగా తాజాగా మళ్ళీ షూట్ మొదలుపెట్టారు.
హరిహర వీరమల్లు సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్టు 14 నుంచి ప్రారంభించారు. ఫైట్ మాస్టర్ స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో ఒక భారీ యుద్ధ సన్నివేశం షూటింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో ఆల్మోస్ట్ 500 మంది ఫైటర్స్, జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్ జరుగుతుండగా త్వరలోనే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూట్ లో జాయిన్ అవ్వనున్నారు అని మూవీ యూనిట్ ప్రకటించింది.
హరిహర వీరమల్లు కూడా రెండు పార్టులుగా వస్తున్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా నిధి అగర్వాల్, బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ లు.. మరింతమంది ప్రముఖులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ వచ్చే సంవత్సరమే రిలీజ్ కి ప్లాన్ చేస్తారని సమాచారం.
Also Read : Big Boss 8 Season: బిగ్ బాస్ కీలక ట్విస్ట్ ఒక్కసారే హోస్ట్ చేంజ్