Hanuman : హనుమాన్ ఈ రేంజ్ బజ్ ఊహించలేదుగా.. స్టార్స్ మధ్య చిన్న సినిమాకు సూపర్ క్రేజ్..!
Hanuman అ! సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంతోనే మెప్పించిన ప్రశాంత్ వర్మ తన ప్రతి సినిమాతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ వస్తున్నాడు.
- By Ramesh Published Date - 10:22 PM, Tue - 9 January 24
Hanuman అ! సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంతోనే మెప్పించిన ప్రశాంత్ వర్మ తన ప్రతి సినిమాతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ వస్తున్నాడు. తనలో ఉన్న టాలెంట్ ని మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకున్న ప్రశాంత్ వర్మ సినిమా సినిమాకు తన గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. లేటెస్ట్ గా హనుమాన్ అంటూ ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో మరోసారి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాను ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీగా ప్రశాంత్ వర్మ ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలన్నీ కూడా సినిమా రేంజ్ పెంచుతూ వచ్చాయి.
We’re now on WhatsApp : Click to Join
తేజా సజ్జా ప్రధాన పాత్రతో వచ్చిన హనుమాన్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది. పోటీలో పెద్ద సినిమాలు వస్తున్నా కూడా హనుమాన్ సినిమాకు కూడా మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమాకు మేకర్స్ చేస్తున్న ప్రమోషన్స్ కూడా సినిమాపై మరింత క్రేజ్ వచ్చేలా చేస్తుంది. హనుమాన్ సినిమా సంక్రాంతికి వస్తున్న పెద్ద సినిమాలకు ధీటుగా వస్తుంది. అయితే మొన్నటిదాకా ఇదో చిన్న సినిమా మహేష్, వెంకటేష్, నాగార్జున ల మధ్య హనుమాన్ నిలబడుతుందా అనుకున్నారు.
కానీ ఈ సినిమాకు రోజు రోజుకీ బజ్ పెరుగుతుంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు మొదట రిలీజ్ అవుతున్న మహేష్ గుంటూరు కారం రోజే హనుమాన్ రిలీజ్ అవుతుంది. మహేష్ సినిమాకు ఈక్వల్ గా హనుమాన్ పై డిస్కషన్స్ నడుస్తున్నాయి. అదీగాక సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్నీ కూడా సినిమా రేంజ్ మరింత పెంచుతుంది. హనుమాన్ సినిమా సంథింగ్ స్పెషల్ మూవీ అని అనిపిస్తుంది. ఈ సినిమాకు పాజిటివ్ బజ్ తీసుకు రావడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది.
Also Read : Ram Charan: చరణ్, బుచ్చిబాబు సినిమాలో భారీ ఫ్లాప్ బ్యాక్ ఎపిసోడ్
ఇక థియేటర్ కు వచ్చిన ఆడియన్ ని సాటిస్ఫై చేస్తే మాత్రం కచ్చితంగా హనుమాన్ సినిమా కూడా ఈ సంక్రాంతికి మంచి సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉంది. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి రావడం కూడా సినిమా బజ్ కి కారణం కావొచ్చు. బుకింగ్స్ ఓపెన్ అవ్వడం ఆలస్యం హనుమాన్ కి మహేష్ సినిమాకు పోటీగా టికెట్స్ తెగేలా ఉన్నాయి. హనుమాన్ సినిమా హిందీ వెర్షన్ లో 1500 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో కన్నా ఈ సినిమాకు అక్కడ విపరీతమైన బజ్ ఏర్పడింది. మరి సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.
Related News
Teja Sajja : పూరీజగన్నాధ్ దర్శకత్వంలో తేజ సజ్జ సినిమా చేయబోతున్నారా..?
పూరీజగన్నాధ్ దర్శకత్వంలో తేజ సజ్జ సినిమా చేయబోతున్నారా..? ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన..