Hamsa Nandini: హాట్ హాట్ అందాలతో మత్తెక్కిస్తున్న హంస నందిని, బికినీతో గ్లామర్ ట్రీట్
తాజాగా హంస నందిని స్విమ్‌సూట్‌లో కనిపించి మరోసారి జిగేల్ మనిపించింది.
- By Balu J Published Date - 01:14 PM, Mon - 11 September 23

అందాలను ఆస్వాదించే సోషల్ మీడియా నెటిజన్స్ టాలీవుడ్ ఐటెం బాంబ్ హంస నందిని ఇష్టపడకుండా ఉండలేరు. సినిమాల్లో వేగం తగ్గించినా ఈ బ్యూటీకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో సందడి చేస్తూ తన అందాలను ఒలకబోయడమే అందుకు కారణం. గతంలో క్యాన్సర్ బారిన హంస.. ఆ వ్యాధి నుంచి కొలుకోని బయటపడింది. మళ్లీ తనకు నచ్చిన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతోంది. విశేషం ఏంటంటే.. ఆమె క్యాన్సర్‌తో పోరాడి గెలిచి మళ్లీ తన గ్లామరస్‌లోకి రావడం విశేషం.
తాజాగా హంస నందిని స్విమ్‌సూట్‌లో కనిపించి మరోసారి జిగేల్ మనిపించింది. సన్ గ్లాసెస్ ధరించి, బికినీ లో బీచ్ లో ఫొటోలకు ఫోజులివ్వడం చూడొచ్చు. ఫొటో షూట్స్ లో చిరునవ్వులు చిందిస్తూ అందాలను ఒలకబోస్తోంది. ఈ స్టిల్స్ కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు చిన్న చిన్న పాత్రల్లో నటించే హంస రాజమౌళి ఈగ మూవీలో నటించి అందరి మనసులను గెలుచుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ పేరు తెచ్చుకుంది. క్యాన్సర్ నుంచి కోలుకున్న ఈ బ్యూటీ మళ్లీ సినిమాల్లోకి రావాలని కోరుకుంటుంది.
Also Read: 14 Died: చంద్రబాబు అరెస్ట్ తో ఆగిన గుండెలు, రాష్ట్రవ్యాప్తంగా 14 మంది మృతి!