Titanic Re released: సినీ లవర్స్ కు గుడ్ న్యూస్..‘టైటానిక్’ మళ్లీ వచ్చేస్తోంది!
ప్రపంచవ్యాప్తంగా టైటానిక్ (Titanic) రీ రిలీజ్ ఉండబోతుందని తెలుస్తుంది.
- By Balu J Published Date - 04:19 PM, Wed - 11 January 23
1997 లో జేమ్స్ కామెరాన్ డైరెక్ట్ చేసిన టైటానిక్ (Titanic) అప్పట్లో సంచలన విజయం అందుకుంది. ఓ అద్భుతమైన ప్రేమ కావ్యంగా టైటానిక్ తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఓ హాలీవుడ్ (Hollwood) సినిమా టాలీవుడ్ పై ప్రభావం చూపించింది అంటే అది టైటానిక్ సినిమానే అని చెప్పొచ్చు. ఆ సినిమా రిలీజ్ అయిన టైం లో స్ట్రైట్ తెలుగు సినిమాలకు పోటీగా టైటానిక్ (Titanic) ఆడిందంటే ఆ సినిమా ఎంత ఇంప్యాక్ట్ క్రియేట్ చేసిందో తెలిసిందే. టైటానిక్ సినిమాతోనే లియోనార్డో డికాప్రియో కేట్ విన్ స్లెట్ లకు భారీ క్రేజ్ ఏర్పడింది.
ఆ తర్వాత వారిద్దరు వరుస హాలీవుడ్ సినిమాలతో అదరగొట్టారు. ముఖ్యంగా టైటానిక్ సినిమాలో కేట్ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక సీన్ లో ఆమె ఒంటి మీద నూలుపోగు లేకుండా నటించడం అప్పట్లో ఒక సెన్సేషన్ గా మారింది. ఎన్నో అరుదైన రికార్డులు సాధించిన టైటానిక్ (Titanic) సినిమా మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది. అవును టైటానిక్ 4K ప్రింట్ రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా టైటానిక్ రీ రిలీజ్ ఉండబోతుందని తెలుస్తుంది.
అయితే మన హీరోల సినిమాల్లో ఒకటి రెండు రోజులు కాకుండా టైటానిక్ ను మళ్లీ సరికొత్త హంగులతో రీ రిలీజ్ (Rereleased) చేస్తున్నారు. ఫిబ్రవర్ 10న టైటానిక్ 4K వర్షన్ 3డిలో అందుబాటులో ఉంటుంది. ఈ సినిమా 3డి వెర్షన్ ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు. జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి టైటానిక్.. రీసెంట్ గా అవతార్ 2 (Avatar2) తో మరోసారి తన సత్తా చాటిన జేమ్స్ కామెరాన్ టైటానిక్ రీ రిలీజ్ తో మళ్లీ వార్తల్లో ఉండనున్నారు.
Also Read: Vijay Vs Ajith: చెన్నైలో ‘స్టార్’ వార్.. విజయ్, అజిత్ అభిమానులపై లాఠీచార్జి!
Related News
RRR : తగ్గేదేలే అంటున్న ఆర్ఆర్ఆర్.. జపాన్ లో ఇప్పటికే అదే క్రేజ్.. హాలీవుడ్ పాప్ సింగర్!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. అంతేకాకుండా కలెక్షన్ ల మోత మోగించింది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో విడుదల అయ్యి కోట్లలో కలెక్షన్స్ ను సాధించింది. కాగ�