Nayanatara Premalu : స్టార్ హీరోయిన్ ను మెప్పించిన ప్రేమలు మూవీ.. సోషల్ మీడియాలో ఏం కామెంట్ పెట్టిందంటే..!
Nayanatara Premalu స్టార్ హీరోయిన్ నయనతార చాలా తక్కువ సినిమాలను తనకు నచ్చాయని చెబుతుంది. మరీ ముఖ్యంగా ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటే ఆ సినిమా
- By Ramesh Published Date - 02:23 PM, Thu - 18 April 24
![Nayanatara Premalu : స్టార్ హీరోయిన్ ను మెప్పించిన ప్రేమలు మూవీ.. సోషల్ మీడియాలో ఏం కామెంట్ పెట్టిందంటే..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/03/Premalu-OTT-Release-date-and-Streaming-Details.jpg)
Nayanatara Premalu స్టార్ హీరోయిన్ నయనతార చాలా తక్కువ సినిమాలను తనకు నచ్చాయని చెబుతుంది. మరీ ముఖ్యంగా ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటే ఆ సినిమా ఎంత బాగా నచ్చాలో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం నయనతార సోషల్ మీడియాలో గుడ్ ఫిలింస్ మేక్స్ మి హ్యాపీ అంటే మంచి సినిమాలు తనని సంతోషపరుస్తాయని కామెంట్ పెట్టింది.
ఇంతకీ నయనతార ఆ కామెంట్ ఏ సినిమాకు పెట్టిందో తెలుసా.. అదే మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా ప్రేమలు సినిమాకే. నెల్సన్, మమితా బైజు నటించిన ప్రేమలు సినిమా యూత్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయ్యాక తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు.
తెలుగులో ప్రేమలు మంచి సక్సెస్ అందుకుంది దాదాపు తమిళంలో కూడా అదే రేంజ్ ఫలితాన్ని రాబట్టుకుంది. అయితే ఈ సినిమా చూసిన నయనతా మాత్రం మంచి సినిమాలు తనని హ్యాపీగా చేస్తాయని కామెంట్ పెట్టింది. స్టార్ హిరోయిన్ నయనతార చేసిన ఈ కామెంట్ ప్రేమలు టీం ను సర్ ప్రైజ్ చేస్తుంది.
ఈ సినిమా చూసిన తర్వాత యూత్ అంతా కూడా మమితా ప్రేమలో పడక మానరు. ప్రేమలు సినిమాతో మమితా బైజుకు సౌత్ లో సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Mamitha Baiju : ప్రేమలు బ్యూటీ నేచర్ లవర్..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/Premalu-Heroine-Mamitha-Baiju-Nature-Lover.jpg)
Mamitha Baiju : ప్రేమలు బ్యూటీ నేచర్ లవర్..!
ప్రేమలు సినిమాల్ సెన్సేషనల్ హిట్ అవ్వడం వల్ల ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారు. ఐతే మరీ లేట్ చేయకుండా ఆ సినిమా ఇలా రిలీజై సక్సెస్ అయ్యిందో లేదో అలా సీక్వెల్