Mahesh : మహేష్ బాబు ఫ్యామిలీ నుండి మరో వారసుడి ఎంట్రీ?
Mahesh : మహేష్ బాబు తండ్రికి తగ్గ కొడుకుగా నిలిచిన రమేష్ బాబు నటుడిగా పెద్దగా వెలుగులోకి రాలేకపోయినప్పటికీ, నిర్మాతగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు
- By Sudheer Published Date - 08:11 PM, Mon - 19 May 25

తెలుగు చిత్రసీమలో ఘట్టమనేని కుటుంబం ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉందో తెలిసిందే. దివంగత సూపర్ స్టార్ కృష్ణ (Krishna) సినీ పరిశ్రమకు ఎనలేని సేవలందించారు. ఆయన వారసుల్లో మహేష్ బాబు (Mahesh), రమేష్ బాబు, మంజుల వంటి వారు తమదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించారు. సుధీర్ బాబు, అశోక్ గల్లా లాంటి చిన్నల్లుళ్లు కూడా హీరోలుగా తమకంటూ ఓ స్థానం ఏర్పరుచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ (Jayakrishna) హీరోగా తెరంగేట్రానికి సిద్ధమవుతున్నారని సమాచారం.
చదువు పూర్తి చేసుకున్న తర్వాత సినిమాలపై ఆసక్తి పెంచుకున్న జయ కృష్ణ, నటనలో శిక్షణ తీసుకుని ఇటీవల ఫోటోషూట్ కూడా పూర్తి చేశాడు. ‘RX 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి(Ajay Bhupathi) ఈ యువ హీరోని పరిచయం చేయబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు వైజయంతి మూవీస్, ఆనంద్ ఆర్ట్స్ కలిసి ఈ ప్రాజెక్టును రూపొందించనున్నట్లు ఫిలింనగర్ టాక్. ఈ వార్తలు వెలువడిన వెంటనే, సూపర్ స్టార్ ఫ్యామిలీ అభిమానులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Snoring Husbands: గురక పెట్టే భర్తలపై ‘పూరి మ్యూజింగ్స్’.. స్లీప్ డివోర్స్ సీక్రెట్స్ ఇవిగో
ఒకపక్క మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ భవిష్యత్‌లో హీరోగా రాబోతున్నాడన్న ఊహాగానాలు ఉండగా, మరోవైపు జయకృష్ణ ఇప్పటికే హీరోగా అరంగేట్రానికి సిద్ధమవుతుండటం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. మహేష్ బాబు తండ్రికి తగ్గ కొడుకుగా నిలిచిన రమేష్ బాబు నటుడిగా పెద్దగా వెలుగులోకి రాలేకపోయినప్పటికీ, నిర్మాతగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు జయ కృష్ణ సినీ రంగ ప్రవేశంతో ఘట్టమనేని కుటుంబ వారసత్వాన్ని కొనసాగించనున్నాడు. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.