Getup Srinu : చిన్న ప్రాణాలు.. చిన్న కామెంట్.. వైరల్ అవుతున్న గెటప్ శ్రీను కామెంట్స్..!
Getup Srinu ఏపీ ఎలక్షన్స్ కోసం సినీ ప్రముఖులు కూడా ప్రచారం చేయడంతో టాలీవుడ్ లో కూడా ఏపీ ఎలక్షన్స్ హాట్ టాపిక్ గా మారాయి. సినిమాలకు సంబందించిన ప్రెస్ మీట్ లో
- Author : Ramesh
Date : 06-05-2024 - 2:29 IST
Published By : Hashtagu Telugu Desk
Getup Srinu ఏపీ ఎలక్షన్స్ కోసం సినీ ప్రముఖులు కూడా ప్రచారం చేయడంతో టాలీవుడ్ లో కూడా ఏపీ ఎలక్షన్స్ హాట్ టాపిక్ గా మారాయి. సినిమాలకు సంబందించిన ప్రెస్ మీట్ లో కూడా ఏపీ ఎలక్షన్స్ టాపిక్ కంపల్సరీ అయ్యింది. లేటెస్ట్ గా గెటప్ శ్రీను లీడ్ రోల్ లో నటించిన రాజు యాదవ్ ట్రైలర్ రిలీజ్ లో కూడా రాజకీయాల ప్రస్తావన వచ్చింది.
ఏపీ ఎలక్షన్స్ సందర్భంగా జబర్దస్త్ టీం అంతా కూడా జనసేన తరపున ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేశారు జబర్దస్త్ టీం.
అయితే ఈ టీం ప్రచారంపై వైసీపీ నేత మంత్రి రోజా చేసిన కామెంట్స్ తెలిసిందే. సినిమాల్లో అవకాశాల కోసం వారిని తొక్కేస్తారనే భయంతో జబర్దస్త్ టీం ప్రచారం చేస్తున్నారని. వాళ్లని చిన్న ప్రాణాలు అందుకే వారిని ఏమి అనలేనని రోజా కామెంట్స్ చేశారు. అయితే రోజా కామెంట్స్ పై గెటప్ శ్రీనుని రెస్పాన్స్ అడిగారు మీడియా మిత్రులు.
Also Read : Ashu Reddy Glamour Show : గ్లామర్ గేట్లు ఎత్తేసిన అషు రెడ్డి.. బాలీవుడ్ కాదు హాలీవుడ్ రేంజ్ షో అదుర్స్..!
మెగా ఫ్యామిలీనే కాదు తమకు అందరు అవకాశాలు ఇస్తున్నారని. తాను ఎన్.టి.ఆర్, వెంకటేష్, నాని సినిమాల్లో చేస్తున్నానని అలా వారి అవకాశాల కోసం ప్రచారం చేయట్లేదని అన్నారు. అంతేకాదు రోజా చేసిన చిన్న ప్రాణాలు కామెంట్ ని చిన్న కామెంట్ అంటూ చెప్పుకొచ్చారు. జబర్దస్త్ టైం లో ఇటు నాగ బాబు, అటు రోజా ఇద్దరినీ ఒకేలా అభిమానించిన జబర్దస్త్ టీం ఎలక్షన్ టైం లో తమ ఓటు పవన్ కళ్యాణ్ కే అని ముందుకొచ్చారు.