Genelia D’Souza: టాలీవుడ్ లోకి జెనీలియా రీఎంట్రీ.. పదేళ్ల తర్వాత మళ్లీ!
ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరొందిన
- By Balu J Published Date - 03:37 PM, Sat - 18 June 22

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరొందిన జెనీలియా డిసౌజా చివరిసారిగా 2012లో వచ్చిన ‘నా ఇష్టం’ సినిమాలో నటించింది. ఆమె చివరిగా తెలుగు సినిమాలో నటించి 10 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం కన్నడ-తెలుగు ద్విభాషా సినిమాతో జెనీలియా తెలుగులో నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాతో కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి తెరంగేట్రం చేయనున్నాడు.
జెనీలియా విషయానికి వస్తే.. ఈ ద్విభాషా చిత్రంలో సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ పాత్రను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో జెనీలియా పాత్రను వెల్లడించే అవకాశాలున్నాయి. ‘పెళ్లి సందడి’ చిత్రంలో తన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీలాతో కిరీటి రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాలో కన్నడ సీనియర్ నటుడు రవిచంద్ర కూడా కనిపించనున్నాడు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. భారీ అంచనాలున్న ఈ కన్నడ-తెలుగు ద్విభాషా చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.