Edit Room : అప్పుడు బాబాయ్..ఇప్పుడు అబ్బాయి..ఇంత దారుణమా..?
Edit Room : రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ (Game changer piracy) మూవీ కూడా అలాగే Edit రూమ్ నుండి వచ్చినట్లు తెలుస్తుంది
- By Sudheer Published Date - 05:24 PM, Fri - 24 January 25

చిత్రసీమను పైరసీ (Piracy) అనే భూతం వెంటాడం ఈరోజుది కాదు..ఎప్పటి నుండో ఉన్నదే. కాకపోతే గతంలో అంతగా క్లారిటీ లేకపోవడం తో పైరసీ వచ్చిన సినీ లవర్స్ థియేటర్స్ కు వెళ్లే సినిమా చూసేవారు. కానీ ఇప్పుడు అలాకాదు HD ప్రింట్ మాదిరి పైరసీ వస్తుండడం తో చాలామంది ప్రింట్ చూస్తూ థియేటర్స్ ను దూరం పెడుతున్నారు. అయితే కొన్ని సినిమాలు Edit రూమ్ నుండే లీక్ అవుతుండడం నిర్మాతలను షాక్ కు గురి చేస్తుంది. తాజాగా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ (Game changer piracy) మూవీ కూడా అలాగే Edit రూమ్ నుండి వచ్చినట్లు తెలుస్తుంది.
ఈ సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన ‘గేమ్ చేంజర్’ మూవీ.. రిలీజై ఒక్క రోజు తిరక్కముందే ఆన్ లైన్లోకి వచ్చేయడం తెలిసిందే. క్వాలిటీ ప్రింట్ బయటికి రావడంతో ఇటు ‘గేమ్ చేంజర్స్’ మేకర్స్‌కు, అటు మెగా అభిమానులకు ఆందోళన తప్పలేదు. పైరసీ ప్రింట్ ఆన్ లైన్లో రిలీజ్ కాకుండా ఉండాలంటే ఐదు కోట్లు డబ్బులు ఇవ్వాలంటూ కొందరు నిర్మాత దిల్ రాజును బెదిరించినట్లు కూడా ఇటీవల వెల్లడైంది.
Virender Sehwag: ఆర్తితో వీరేంద్ర సెహ్వాగ్ విడాకులు…?
పైరసీ ప్రింట్ విషయమై కొందరు నిందితులను గుర్తించి ఇటీవల కేసులు కూడా పెట్టారు. పైరసీ లింక్స్‌ను ఆన్ లైన్ నుంచి తీయించడానికి గట్టి ప్రయత్నమే జరిగినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు మళ్లీ ‘గేమ్ చేంజర్’ మరోసారి పైరసీ బారిన పడింది. తమిళంలో మరియు హిందీ లో ఈ సినిమాకు సంబంధించి మరింత క్వాలిటీ ప్రింట్ ఆన్ లైన్లోకి వచ్చింది. ఓటీటీలో సినిమా రిలీజ్ చేస్తే ఎంత క్వాలిటీ ఉంటుందో.. అంతే క్వాలిటీ తో రావడంతో ఫ్యాన్స్ మరింత షాక్ కు గురి అవుతున్నారు.
ఈ వెర్షన్ సినిమా ఎడిట్ రూం నుంచే లీక్ అయినట్లు వార్తలు వస్తుండడం గమనార్హం. ఇందుకు సంబంధించి నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రూఫ్స్ కూడా పెడుతున్నారు. ఈ సినిమా ఎడిట్ దశలో ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిగా జరగని వెర్షన్‌ను ప్రస్తుతం ఆన్ లైన్లో లీక్ చేసినట్లు తెలుస్తోంది. అనేక సన్నివేశాల్లో సీజీ పూర్తి కాని.. డబ్బింగ్ సరిగా జరగని సీన్లు ఈ వెర్షన్లో ఉన్నాయి. దీన్ని బట్టి తమిళ వెర్షన్ కానీ, హిందీ వెర్షన్ ఎడిటింగ్ జరిగిన చోటి నుంచి ఎవరో ఈ సినిమాను లీక్ చేసారని పక్కాగా తెలుస్తుంది. ఇది ముమ్మాటికీ కావాలని చేసిందే అని అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా ఇలాగే పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రాన్ని లీక్ చేసారు. అది కూడా సినిమా రిలీజ్ కు రెండు రోజుల సమయం ఉన్నప్పుడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. అయినప్పటికీ ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లి సినిమా చూసి అఖండ విజయాన్ని అందించారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం రివర్స్ అయ్యింది. ఏది ఏమైనప్పటికి చిత్రసీమలో పనిచేస్తూనే అదే చిత్రసీమకు ద్రోహం చేయడం చాల తప్పు.