Tollywood : గెటప్ శ్రీను ప్రకటనతో షాక్ లో ఫ్యాన్స్
ప్రస్తుతం కొద్దీ రోజుల పాటు సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు
- By Sudheer Published Date - 05:39 PM, Wed - 15 May 24

జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను (Getup Srinu) తన ఫాలోయర్స్ షాక్ ఇచ్చాడు. కొద్దీ రోజుల పాటు సోషల్ మీడియా కు దూరంగా ఉంటానని తెలిపారు. జబర్దస్త్ తో ఎంతో పాపులర్ అయినా శ్రీను..వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్ట్ గా మారాడు. ఇక ఇప్పుడు ‘రాజూ యాదవ్’ (Raju Yadav) సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మే 17న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ , సాంగ్స్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేసాయి. ఇక సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉండే శ్రీను..ప్రస్తుతం కొద్దీ రోజుల పాటు సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు.
We’re now on WhatsApp. Click to Join.
దీనిపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శ్రీను మే 13వరకు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ జనసేన తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు అని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం తన సినిమా రిలీజ్ అయ్యాక మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతాడు అని చెబుతున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఇది ఒక రకమైన మూవీ ప్రమోషన్ స్టంట్ అని, తన పోస్ట్ ద్వారా రాజు యాదవ్ సినిమాపై బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. ఏదిఏమైనా శ్రీను మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యేవరకు ఈ విషయం మీద క్లారిటీ రాదు.
ఇక శ్రీను నటించిన ‘రాజూ యాదవ్’ మూవీ విషయానికి వస్తే..నీది నాది ఓకే కథ, విరాటపర్వం సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందించగా కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి కలిసి నిర్మించారు.
Read Also : T20 World Cup 2024: ప్రపంచ కప్‌కు ముందు టీమిండియాకు ప్రాక్టీస్ మ్యాచ్.. ఎప్పుడంటే..?