HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >F3 Superhit In All Areas From Andhra To America Dil Raju

Dil Raju: హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకుపోతున్న ఎఫ్3!

'' మూడో వారంలో కూడా ఎఫ్ 3ని చూసి మాకు ఇంకా షేర్ రూపంలో డబ్బు ఇస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.

  • Author : Balu J Date : 14-06-2022 - 3:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
F3
F3

” మూడో వారంలో కూడా ఎఫ్ 3ని చూసి మాకు ఇంకా షేర్ రూపంలో డబ్బు ఇస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మూడో వారం కూడా సినిమా థియేటర్ లో ఆడుతూ ఇంకా రెవెన్యూ రాబట్టడమే ఎఫ్ 3 విజయానికి నిదర్శనం” అన్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పకులుగా నిర్మాత శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ఎఫ్3 ‘మే 27న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. హౌస్ ఫుల్ వసూళ్ళతో దూసుకుపోతున్న ఈ చిత్రం ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ వేడుకలో ఆయన చేతుల మీదగా యూనిట్ కు మెమొంటోలు అందజేశారు.

ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ఇది కుటుంబ వేడుక. దిల్ రాజు, శిరీష్ ప్రతి సినిమా కథ చర్చలకు, చూడటానికి, వేడుకల్లో అతిధిగా ఇలా ప్రతి సందర్భంలో కలుస్తూనే వుంటాం. దిల్ రాజు, శిరీష్ కథలు ఎంపిక చేయడంలో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. డ్రామా, ఎంటర్ ట్రైనర్, పెద్ద సినిమా, చిన్న సినిమా ఇలా అన్ని రకాల జోనర్ సినిమాలు తీస్తారనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. కొత్త దర్శకుల ను ప్రోత్సహించి ఇండస్ట్రీ కి పరిచయం చేసిన ఘనత వారికి దక్కుతుంది. ఇండస్ట్రీకి దిల్ రాజు గొప్ప కాంట్రిబ్యూషన్ చేశారు. ఆయన ద్వారా పరిచయమైన దర్శకులు ఈ రోజు సూపర్ సక్సెస్ లో వున్నారు. ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు సక్సెస్ వేడుకలకి నేనే అతిధిగా వచ్చాను. ఇప్పుడు ఎఫ్ 3 తో హ్యాట్రిక్. ఈ మధ్య నేను సినిమాకి రాసుకున్న ప్రేమ లేఖ పేరుతో పుస్తకం రాశాను. అందులో చివరి పేజీలో సినిమా ఇలానే ఉండాలనే రూల్ లేదు. సినిమా ఇలా కూడా ఉండొచ్చు” అనే ముంగిపు పేజీలో రాశాను . దాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రూవ్ చేశారు. హీరోకి కళ్ళు కనపడవు, ఇంకో హీరో సరిగా మాట్లాడలేడు. అమ్మాయిలకి రోమాన్స్ కన్నా డబ్బు పిచ్చి ఇలా అసాధ్యమైన అంశాలని పెట్టి విజయం సాధించడం అనిల్ రావిపూడికి ఒక్కడికే సాధ్యం. ఖాళీ కడుపుతో వున్నపుడు హోటల్ కి వెళ్లి భోజనం చేసిన ఆనందం అందరూ ఫీలైవుంటారు. అలా అనిల్ సినిమాకి రావాలంటే ఇంట్లో చిరాకులన్నీ మర్చిపోయి ఖాళీ బుర్రతో రావాలి. అప్పుడు జేబు నిండా నవ్వులు వేసుకొని వెళ్ళొచ్చు. ఖాళీ జేబు ఉండొచ్చు ఏమో కానీ ఖాళీ బుర్ర వుండదనే సరికొత్త ఆలోచనతో చేసిన ఈ సినిమా వినోదంతో పాటు గొప్ప సందేశాన్ని కూడా పంచింది. చాలా క్రియేటివ్ గా అలోచించి స్టార్లందరిని ఒకే సినిమాలో పెట్టేశారు. అందరి స్టార్లతో పాన్ ఇండియా సినిమా తీసినట్లు ఉంది. వరుణ్ తేజ్, వెంకటేష్, దిల్ రాజు, శిరీష్ అనిల్ రావిపూడి.. ఎఫ్ 3టీం అంతటికి మరోసారి అభినందనలు” అని తెలిపారు

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఎఫ్ 3విడుదలైనప్పటి నుండి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ., తెలుగు రాష్ట్రాలు, ఓవర్సిస్ లో అద్భుతమైన విజయం సాధించింది. దర్శకుడు అనిల్ రావిపూడితో ఐదు విజయవంతమైన సినిమాలు పూర్తయ్యాయి. డబుల్ హ్యాట్రిక్ కి రెడీ అవుతున్నాం. వెంకటేష్ గారితో మూడు విజయాలు, వరుణ్ తేజ్ గారితో మూడు విజయాలు అందుకున్నాం. నిజమైన సక్సెస్ ఏది అనేది డిస్ట్రిబ్యూటర్స్ కు ఎప్పుడూ ఒక ప్రశ్నే. ఎఫ్ 3 మొదలుపెట్టిన తర్వాత పాండమిక్ వచ్చింది. దీని కారణంగా బడ్జెట్ పెరుగుకుంటూ వెళ్ళింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే డిస్ట్రిబ్యూషన్ లో ఈ బడ్జెట్ లెక్కలు పరిగణలోకి తీసుకురాలేదు. మాకు పర్మినెంట్ గా వుండే డిస్ట్రిబ్యూటర్స్ తో కలసి మంచి అవగాహనతో సినిమాని విడుదల చేశాం. నిజమైన సక్సెస్ ఎప్పుడంటే .. సినిమాని ప్రేక్షకులు బావుందన్నపుడు మాకు ఫస్ట్ ఎక్సయిట్ మెంట్, సినిమాని రోజు రోజుకు ఎంజాయ్ చేస్తూ ఆదరణ పెరుగుతున్నపుడు మాకు ఆనందంగా వుంటుంది. రెండు.. మేము పెట్టిన డబ్బు వెనక్కి తిరిగివచ్చినపుడు ఇంకా ఆనందంగా వుంటుంది. డిస్ట్రిబ్యూటర్స్ కు మాకు గొప్ప అవగాహన వుంది. అందుకే వారంతా మాకు కుటుంబ సభ్యులయ్యారు. మమ్మల్నీనమ్మి మాతో ప్రయాణం చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.
పాండమిక్ తర్వాత వీకెండ్ సినిమాలైపోయాయి. శుక్ర, శని, ఆదివారాలు కలెక్షన్ వుండి తర్వాత తగ్గిపోతున్నాయి. పాండమిక్ తర్వాత సినిమాలో చాలా మార్పులు వచ్చాయి. ఇంకా రాబోతున్నాయి. దిన్ని మేము అర్ధం చేసుకొని ప్లానింగ్ మార్చుకోవాలి. ఇంత పాండమిక్ లో కూడా నిన్నటికి 17రోజులు పూర్తయి థర్డ్ వీకెండ్ కూడా ఎఫ్ 3ని ప్రేక్షకులు చూసి మాకు ఇంకా షేర్ రూపంలో డబ్బు ఇస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మూడో వారం కూడా సినిమా థియేటర్ లో ఆడుతూ ఇంకా రెవెన్యూ రావడమే ఎఫ్ 3 విజయానికి నిదర్శనం. అదే ఈ వేడుక ప్రత్యేకత. ఒక సినిమా విజయం సాధిస్తే షీల్డ్ ఇవ్వడం నాకు చాలా ఇష్టం. అది చాలా గొప్ప జ్ఞాపకం. ఎఫ్ 3 యూనిట్ కు గొప్ప జ్ఞాపకంగా వుండాలని అందరికీ షీల్డ్స్ ఇచ్చాం. ఇది మాకు చాలా ఆనందంగా వుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ గారికి కృతజ్ఞతలు. అనిల్ రావిపూడితో సెకండ్ హ్యాట్రిక్ పూర్తి చేస్తాం” అన్నారు.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. సినిమా విడుదలైన తర్వాత మంచి రెస్పాన్స్ రావడం, నిర్మాతలకు డబ్బులు రావడం ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయి. డిస్ట్రిబ్యూటర్లు అందరూ హ్యాపీగా వున్నారనే ఆలోచన ప్రతి నటుడికి ఆనందాన్ని ఇస్తుంది. ఎఫ్ 3లో భాగమైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమాని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు” అన్నారు.

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనం. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3 ఇలా ఆరుకి ఆరు సినిమాలు మీ గుండెల్లో పెట్టుకొని ఆదరించారు. ఇది నాకు చాలా పెద్ద విషయం. ముందు ముందు చేసే సినిమాలకి ఇది గ్రేట్ ఎనర్జీ. చిన్నప్పటి నుండి థియేటర్ లో కూర్చుంటే బాల్కనీ నుండి నేల వరకూ అందరూ ఇష్టపడే సినిమాలని ఇష్టపడే వాడిని. అందుకే ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండే కథని రాస్తుంటాను. నాకు గొప్ప పేరు వస్తుందా రాదా అని అలోచించను. డబ్బులు పెట్టి సినిమా చూస్తున్న ప్రేక్షకులని ఎలా ఎంటర్ టైన్ చేయాలనే ఆలోచనతోనే కథలు రాస్తుంటాను. నాకు తెలిసిన సినిమా అదే. అదే తీస్తున్నాను అదే మీరు ఆదరిస్తున్నారు. సినిమా సినిమాకి ఎంతో కొంత నేర్చుకుంటున్నాను. జోనర్స్ మారుస్తున్నాను. మీ అందరి ఆశీస్సులతో ఇంత దూరం వచ్చాను. మున్ముందు కూడా మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను. పాండమిక్ తర్వాత సినిమా చూసే విధానం మారింది. ఓటీటీ ఓ సమాంతర వేదిక అయ్యింది. సినిమా థియేటర్ కి వస్తే లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు , విజువల్ వండర్స్ ని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా వీకెండ్ అయిపోతుంది. వారం గడిస్తే సినిమా ఉంటుందా అనే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఎఫ్ 3 థర్డ్ వీకెండ్ లో కూడా షేర్ రాబడుతూ, కొన్ని చోట్ల హౌస్ ఫుల్స్ అవుతూ ప్రేక్షకులు ఆధరిస్తున్నారంటే .. ఇది నిజమైన విజయం. ఎఫ్ 3విజయం పట్ల చాలా గర్వంగా వుంది. పాండమిక్ తర్వాత ప్రేక్షకులంతా వంద కోట్లకి పైగా గ్రాస్ ఇచ్చారంటే ఇది మామూలు విషయం కాదు. ఇంత గొప్ప విజయం ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు.

దిల్ రాజు గారితో పటాస్ నుండి ఇప్పటివరకూ లాంగ్ జర్నీ. మేము చాలా విషయాలు షేర్ చేసుకుంటాం. నేను చేయబోయే సినిమాల కథలు కూడా రాజు గారికి తెలుసు. దిల్ రాజు, శిరీష్ గారికి కృతజ్ఞతలు. ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించి ఇంకా మూడు వారాలు పాటు ప్రమోషన్స్ చేస్తున్నా మా పీఆర్ టీమ్ కి పేరు పేరున థాంక్స్. డైరక్షన్ డిపార్ట్ మెంట్ కి స్పెషల్ థాంక్స్. నేను పని చేసిన హీరోలు నాకు స్పెషల్ గా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. సాయి ధరమ్ తేజ్ , రవితేజ గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ సక్సెస్ వచ్చినందుకు అభినందిచారు. హీరో నితిన్ ఈ సినిమా రషెస్ చూసి అందరికీ సూపర్ హిట్ బ్లాక్ బస్టరని అడిగి అడగని వారందరికీ చెప్పి పబ్లిసిటీ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫోన్ చేసి అనిల్ హిలేరియస్ గా ఎంజాయ్ చేశాను, నవ్వుతూనే వున్నాను, వెంకటేష్ గారు ఇరగదీశారు, వరుణ్ నత్తి వచ్చిన ప్రతిసారి ఎంజాయ్ చేశాను. నమ్మిన సినిమాని బలంగా తీశావ్ ‘ అని మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. బాలకృష్ణ గారు ప్రసాద్ ల్యాబ్ లో స్పెషల్ గా షో చూసి అభినందించారు. ఆయనకి నా స్పెషల్ థాంక్స్. వెంకటేష్ గారు షూటింగ్ కారణంగా ఈ వేడుకకి రాకలేకపోయారు. వెంకటేష్ గారి సపోర్ట్ ని మర్చిపోలేను. వెంకటేష్, వరుణ్ తేజ్ మా వెనుకే వుండి నడిపించారు. ఎఫ్ 3 బిగినింగ్ నుండి ఇప్పటి వరకూ సపోర్ట్ చేసిన ప్రింట్, ఎలక్ట్రాన్ మీడియా, వెబ్ , సోషల్ మీడియా అందరికీ థాంక్స్. ‘F2’ ఫ్రాంచైజీతో మళ్ళీ వస్తాం. ఫన్ అండ్ ఫస్ట్రేషన్ తో మిమ్మల్ని మళ్ళీ అలరిస్తాం. ఆరు నెలల్లో నటసింహ నందమూరి బాలకృష్ణ ‘ఎన్ బీకే 108’తో మళ్ళీ కలుద్దాం ” అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Daggubati Venkatesh
  • dil raju
  • f3
  • success meet
  • Varun Tej

Related News

Mana Shankara Vara Prasad Garu

శంకర వరప్రసాద్ ఆల్రెడీ సూపర్ హిట్..నెక్స్ట్ వెంకటేశ్‌తో ఫుల్‌లెంగ్త్‌ మూవీ: చిరంజీవి

Mana Shankara Varaprasad Garu  చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించిన సినిమా ‘మన శంకర వరప్రసాద్‌ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ అంతా ఒక పిక్నిక్‌లా సాగిందని తెలిపారు. వెంకటేష్‌ను “మోడ్రన్ డ్రెస్ వేసుకున్న గురువు”గా అభివర్ణించిన చిరు.. సంక్రాంతికి తన సినిమాతో పాటు వస్తున్న ప్రభా

  • Mana Shankara Varaprasad Garu

    మన శంకర వరప్రసాద్ గారు సెన్సార్ పూర్తి..

  • Chiru Bobby

    మన శంకర వర ప్రసాద్ ప్రాజెక్ట్‌పై షాకింగ్ అప్‌డేట్.. ?

Latest News

  • వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

  • జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

  • జియో ఐపీఓ: 2.5% వాటా విక్రయించే యోచనలో రిలయన్స్‌!

  • ఉక్రెయిన్ పై మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా

  • రోజూ అవిసె గింజల పొడి తింటే కలిగే లాభాలివే..!

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd