Highest Paid Indian Actor: రెమ్యూనరేషన్ లో విజయ్ దళపతి రికార్డ్, ఒక్క సినిమాకే 200 కోట్లా..!
విజయ్ దళపతి ఒకే సినిమాకు 200 కోట్ల రూపాయలు తీసుకున్న మొదటి భారతీయ నటుడిగా అవతరించబోతున్నాడు.
- By Balu J Published Date - 05:46 PM, Fri - 19 May 23

దక్షిణాదిలో విజయ్ దళపతి బిగ్గెస్ట్ సూపర్ స్టార్. బాక్సాఫీస్ కలెక్షన్లు, సోషల్ మీడియా ఫాలోవర్లు లేదా రెమ్యునరేషన్ లాంటి ప్రతి అంశంలోనూ నటుడు కొత్త రికార్డును సెట్ చేస్తుంటాడు. అయితే లేటెస్ట్ సమాచారం ఏంటంటే.. విజయ్ ఒకే సినిమాకు 200 కోట్ల రూపాయలు తీసుకున్న మొదటి భారతీయ నటుడిగా అవతరించాడు. అవును తన నెక్ట్స్ నటించబోయే చిత్రానికి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు వెల్లడైంది. లియో తర్వాత దళపతి విజయ్ తన తదుపరి చిత్రం కోసం వెంకట్ ప్రభుతో జతకట్టనున్నట్లు సమాచారం.
అధికారికంగా ప్రకటించాల్సిన ఈ మూవీకి కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి 100 కాదు 150 కాదు ఏకంగా 200 కోట్ల రూపాయల భారీ రెమ్యూనరేషన్ అడిగాడు. AGS ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీకి భారీగా పారితోషికం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. గతంలో మాస్టర్ మూవీ కోసం విజయ్ రూ. 80 కోట్ల పారితోషికం తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టార్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న పాన్-ఇండియన్ చిత్రం ‘లియో’ కోసం ఒక్కసారిగా రెమ్యూనరేషన్ పెంచినట్టు తెలుస్తోంది. ఒకవేళ విజయ్ 200 కోట్ల పారితోషికం తీసుకుంటే, హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక భారతీయ నటుడు తళపతి విజయ్ అవుతాడు.
కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి ( Thalapathy Vijay ) తో వెంకట్ ప్రభుత సినిమా ఓకే చేసేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఈ సినిమాకే విజయ్ భారీ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడు. విజయ్ కెరీర్ లో ఈ సినిమా 68వ సినిమాగా తెరకెక్కనుంది. మరి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ప్రజెంట్ అయితే విజయ్ తన 67వ సినిమాను లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. లియో అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
Also Read: Adivi Sesh-Supriya: అక్కినేని ఇంట పెళ్లిభాజాలు.. అడవి శేష్ తో సుప్రియ పెళ్లి?