Rajamouli : రాజమౌళికి ఆర్ఆర్ఆర్ , బాహుబలి కంటే ఆ సినిమానే ఇష్టమట !!
Rajamouli : ‘ఈగ’ సినిమా హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయడం ద్వారా ఇతర భాషల ప్రేక్షకుల్లో రాజమౌళికి మంచి గుర్తింపు వచ్చింది
- By Sudheer Published Date - 08:07 PM, Thu - 17 July 25

పాన్ ఇండియా దర్శకుడిగా పేరు పొందిన ఎస్ఎస్ రాజమౌళి(Rajamouli), తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘బాహుబలి’ సిరీస్ ద్వారా భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఆస్కార్ వరకూ చేరి భారత సినీ చరిత్రలో మైలురాయి గా నిలిపాడు. అయితే ఈ రెండు ప్రతిష్టాత్మక సినిమాలను పక్కనపెట్టి తనకు అత్యంత ఇష్టమైన సినిమా ఏదంటే ‘ఈగ’ అని స్వయంగా రాజమౌళే ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
‘ఈగ’ సినిమా వల్లే బాహుబలి కు బేస్ ఏర్పడింది – రాజమౌళి
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి కథానాయకుడిగా నటించిన ‘జూనియర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమౌళి, తన గత సినిమాల వర్కింగ్ స్టిల్స్ చూసి స్పందించే సందర్భంలో, ‘ఈగ’ స్టిల్ చూపించగానే, ‘‘ఇది నా బెస్ట్ సినిమా’’ అంటూ వ్యాఖ్యానించారు. హీరో లేకుండా ఈగ అనే పురుగును కథానాయకుడిగా చూపించి, పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించడం సాహసోపేతమని ఆయన వివరించారు. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన రావడం వల్లే ఈ సినిమాపై ఆయనకు ప్రత్యేక ప్రేమ ఉండవచ్చు.
Vijay Devarakonda : ఆ వ్యాధి బారినపడిన విజయ దేవరకొండ ..హాస్పటల్ చికిత్స
పాన్ ఇండియా మార్కెట్‌కి మార్గం వేసిన ‘ఈగ’
‘ఈగ’ సినిమా హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయడం ద్వారా ఇతర భాషల ప్రేక్షకుల్లో రాజమౌళికి మంచి గుర్తింపు వచ్చింది. దాంతో బాహుబలి విడుదలయ్యే సమయానికి ఆయన పేరు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఈ సినిమాతో ప్రయోగాత్మక కథా నిర్మాణానికి ఓ ఉదాహరణగా నిలిచిన రాజమౌళి, అప్పటి నుంచి ప్రతీ సినిమాకీ అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చే విధంగా పనులు చేయడం ప్రారంభించారు. ‘ఈగ’ ఒక సాంకేతిక, భావోద్వేగ ప్రయోగంగా విజయాన్ని అందుకోవడంతో, దాన్ని తన హృదయానికి అత్యంత చేరువైన సినిమాగా భావిస్తున్నట్టు అర్థమవుతోంది.
ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ
రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ (SSMB29) తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఇప్పటి వరకూ ఆయన చేసినవాటిలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ప్రియాంక చోప్రా ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.
Pakistan Floods : పాకిస్థాన్‌లో తుపానుల బీభత్సం.. 124కి చేరిన మృతుల సంఖ్య