Eagle : ఈగల్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ..
- By Sudheer Published Date - 01:36 PM, Mon - 12 February 24

మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఎట్టకేలకు హిట్ కొట్టాడు. ధమాకా (Dhamaka) తర్వాత సరైన హిట్ లేని రవితేజ..తాజాగా ఈగల్ (Eagle )మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సాలిడ్ హిట్ కొట్టాడు. గత కొద్దీ రోజులుగా రవితేజ కు సరైన హిట్ పడకపోయేసరికి అభిమానులు సైతం ఈగల్ విషయంలో కాస్త అయోమయంలోనే ఉన్నారు. డైరెక్టర్ గా పరిచయం అవుతున్న కార్తీక్ సినిమాను ఎలా తీసాడో ఏమో..అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ థియేటర్స్ కు వెళ్లారు. కానీ కార్తీక్ మాత్రం అందర్నీ కట్టిపడేసాడు. ఇంటర్వెల్ , క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. టాక్ బాగుండడం తో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పోటీ పడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
దీంతో ఈ వీకెండ్ అంతా కూడా ఈగల్ మేనియా నే నడిచింది. మౌత్ టాక్ కలిసి రావడంతో ఈగల్‌కు అదిరిపోయేలా వసూళ్లు వస్తున్నాయి. ఈ మూడు రోజుల్లో ఈగల్ సినిమాకు ముప్పై కోట్ల గ్రాస్.. పది హేను కోట్ల షేర్ వచ్చినట్టుగా సమాచారం. కలెక్షన్లు ఇలాగే ఉంటె మరో రెండు రోజుల్లో థియేట్రికల్ పరంగా బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడం తో పార్ట్ 2 యుద్దకాండ మీద దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మరింతగా ఫోకస్ పెట్టేలానే ఉన్నాడు. నెక్ట్స్ ఇంకా మరిన్ని ఎలివేషన్లు కావాలని ఆదివారం జరిగిన సక్సెస్ మీట్‌లో రవితేజ కోరిన సంగతి తెలిసిందే. మాటల రచయిత మణిబాబుని రవితేజ ప్రశంసల్లో ముంచెత్తారు.
ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల తదితరులు కీలక పాత్రలను పోషించారు.
Read Also : Black Grapes: శీతాకాలంలో నల్లద్రాక్ష తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?