Karthika Deepam 2 : కార్తీక దీపం సీరియల్ సీక్వెల్ ఉందా? డాక్టర్ బాబు ఏమన్నాడు?
తాజాగా ఈ సీరియల్ లో డాక్టర్ బాబు క్యారెక్టర్ చేసిన నిరుపమ్ ఓ ఇంటర్వ్యూలో దీనికి సీక్వెల్ గురించి మాట్లాడాడు.
- By News Desk Published Date - 07:00 PM, Tue - 27 June 23

తెలుగు టీవీ సీరియల్స్(TV Serials) లో కార్తీకదీపం(Karthika Deepam) సీరియల్ ఒక సంచలనం సృష్టించింది. ఇండియాలోనే ఏ సీరియల్ కి రానంత టీఆర్పీ(TRP) రావడమే కాక దాన్ని కొన్ని సంవత్సరాల పాటు అలాగే మెయింటైన్ చేసింది. ఇండియాలో IPL కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. IPL ఉన్నా కూడా దానికి మించి కార్తీకదీపం సీరియల్ టీఆర్పీ తెచ్చుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. తెలుగు రాష్ట్రాల్లోని మహిళలంతా ఈ సీరియల్ కి కనెక్ట్ అయ్యారు.
ఇక ఈ సీరియల్ లోని రెండు క్యారెక్టర్స్ అయితే బాగా వైరల్ అవ్వడమే కాక వాళ్ళ క్యారెక్టర్ నేమ్స్ తోనే అందరూ గుర్తుపెట్టుకున్నారు. కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు(Doctor Babu) క్యారెక్టర్ ని నిరుపమ్(Nirupam) చేశాడు. ఇక వంటలక్క(Vantalakka) క్యారెక్టర్ మలయాళం(Malayalam) నటి ప్రేమి విశ్వనాధ్(Premi Viswanath) చేసింది. సీరియల్ లో భార్యభర్తలుగా నటించి వంటలక్క కష్టాలతో ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించారు. మలయాళం నటి అయినా తెలుగువాళ్ళకు బాగా దగ్గరైంది.
ఇటీవల కొన్ని నెలల క్రితం ఈ సీరియల్ అయిపోయింది. ఎప్పుడో అవ్వాల్సి ఉన్నా ఆ క్యారెక్టర్స్ ని తీసేసి కొన్నాళ్ళు నడిపించారు. కానీ సీరియల్ కి టీఆర్పీ రాలేదు. దీంతో మళ్ళీ ఆ రెండు క్యారెక్టర్స్ ని తీసుకొచ్చి సీరియల్ కి ముగింపు పలికారు. అయితే తాజాగా ఈ సీరియల్ లో డాక్టర్ బాబు క్యారెక్టర్ చేసిన నిరుపమ్ ఓ ఇంటర్వ్యూలో దీనికి సీక్వెల్ గురించి మాట్లాడాడు.
నిరుపమ్ మాట్లాడుతూ.. నాకు తెలిసి కార్తీక దీపం సీక్వెల్ రావాలంటే దానికి మించిన కథ రావాలి. దానికి కొనసాగింపు ఉండకపోవచ్చు. అన్ని కుదిరితేనే కార్తీకదీపం సీక్వెల్ చేయాలి. లేదంటే దానిని ముట్టుకోకుండా ఉండటమే బెటర్. కానీ ప్రేమి విశ్వనాథ్, నేను మా కాంబినేషన్ లో ఇంకో సీరియల్ అయితే ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. దీంతో ఈ సీరియల్ అభిమానులు రెండిట్లో ఏది కుదిరినా పర్లేదు మీ ఇద్దర్ని మళ్ళీ చూడాలని అంటున్నారు.
Also Read : BRO Looks: లుంగీ గెటప్ లో పవన్, సాయిధరమ్ తేజ్, వింటేజ్ లుక్స్ అదుర్స్