Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్ మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
రీసెంట్ గా నాని 'దసరా'తో కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ మూవీకి కోటి రూపాయల పైనే అందుకున్నట్లు తెలుస్తుంది. అయితే కీర్తి మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
- By News Desk Published Date - 09:30 PM, Mon - 10 July 23

సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ ‘కీర్తి సురేష్'(Keerthy Suresh). బాల నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన కీర్తి ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. తెలుగులో రామ్ హీరోగా నటించిన ‘నేను శైలజ'(Nenu Sailaja) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2018లో వచ్చిన ‘మహానటి'(Mahanati) సినిమాతో తెలుగులో ఎంతో గుర్తింపుని అందుకుంది. అంతేకాదు ఈ సినిమాకి నేషనల్ అవార్డు(National Award)ని కూడా అందుకుంది. టాలీవుడ్ లో పలువురు స్టార్స్ తో నటించిన ఈ భామ ప్రస్తుతం ఒక్కో సినిమాకి కోటి రూపాయల పైనే రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం.
రీసెంట్ గా నాని ‘దసరా’తో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ మూవీకి కూడా కోటి రూపాయల పైనే అందుకున్నట్లు తెలుస్తుంది. అయితే కీర్తి మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? అది తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. కీర్తి సురేష్ మొదటి రెమ్యూనరేషన్ గురించి ఇటీవల ఆమె తండ్రి సురేష్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కీర్తి మొదటి సంపాదన కేవలం 500 రూపాయలు. కీర్తి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన సంగతి తెలిసిందే. మలయాళంలో తెరకెక్కిన ‘పైలట్స్’ అనే సినిమాలో కీర్తి చర్చిలో పాపగా కనిపించింది. ఈ సినిమాకి కీర్తి సురేష్ తండ్రే నిర్మాత. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాలో నటించినందుకు కీర్తికి 500 ఇచ్చాడట తండ్రి సురేష్.
ఆ తరువాత మరో రెండు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఈ భామ 2013 లో మోహన్ లాల్ ‘గీతాంజలి’ సినిమాతో హీరోయిన్ గా డెబ్యూ ఇచ్చింది. అయితే ఈ సినిమా కంటే ముందు మధ్యలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళంలోని పలు టీవీ షోల్లో కూడా కనిపించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళంలో వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్న కీర్తి లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తుంది. స్టార్ హీరోల సరసన చెల్లి పాత్రలు చేస్తూ ఈ జనరేషన్ లో ఏ హీరోయిన్ చేయని సాహసాన్ని కూడా చేస్తుంది కీర్తి.
Also Read : Thaman : సోషల్ మీడియాలో విమర్శలు, గుంటూరు కారం సినిమా ఆలస్యంపై తమన్ కామెంట్స్..