Divya Bharathi : దివ్య భారతి అందాల జాతర.. చూపు తిప్పుకోనివ్వని అమ్మడు..!
Divya Bharathi చెన్నైలో యువ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్న హీరోయిన్ దివ్య భారతి తెలుగులో కూడా అమ్మడు ప్రయత్నాలు మొదలు పెట్టింది.
- By Ramesh Published Date - 08:13 AM, Sat - 11 May 24
Divya Bharathi చెన్నైలో యువ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్న హీరోయిన్ దివ్య భారతి తెలుగులో కూడా అమ్మడు ప్రయత్నాలు మొదలు పెట్టింది. జబర్దస్త్ ఫేం సుడిగాలి సుధీర్ నటిస్తున్న G.O.A.T సినిమాలో దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తుంది. తమిళంలో ఆరేడు సినిమాల దాకా చేసిన దివ్య భారతి తెలుగులో మాత్రం ఇంకా సరైన క్రేజ్ తెచ్చుకోలేదు.

అయితే సోషల్ మీడియాలో మాత్రం దివ్య భారతి అదరగొడుతుంది. అమ్మడు తన గ్లామర్ ట్రీట్ తో ఫాలోవర్స్ కు ఫుల్ ఫీస్ట్ అందిస్తుంది. లేటెస్ట్ గా వైట్ కలర్ డ్రెస్ లో దివ్య భారతి అందాల జాతర ఒక రేంజ్ లో ఉంది. పరువాలతో ప్రేక్షకులను తన బుట్టలో వేసుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది.

దివ్య భారతి లేటెస్ట్ ఫోటో షూట్ చూసిన వారెవరైనా చూపుతిప్పుకోలేకపోతున్నారని చెప్పడంలో సందేహం లేదు. తనని ఫాలో అవుతున్న మూడున్నర మిలియన్ల మంది ఫాలోవర్స్ కు తన గ్లామర్ తో ఖుషి చేస్తుంది దివ్య భారతి. గ్లామర్ ఫీల్డ్ లో ఇలా తమ టాలెంట్ చూపిస్తేనే అవకాశాలు వస్తాయని ఫిక్స్ అయిన దివ్య భారతి ఒక రేంజ్ లో రెచ్చిపోతుంది.
స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నట్టుగానే ఉన్నా అమ్మడు స్టార్ డైరెక్టర్స్ దృష్టిలో పడితే బాగుంటుందని అనుకుంటున్నారు.
Also Read : Samyukta Menon : టాలీవుడ్ పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. అక్కడ నటించాలంటే కష్టం అంటూ..!