Ravi Teja Jinthaak: హోరెత్తిస్తున్న జింతాక్ జింతాక్!
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం "ధమాకా" టైటిల్ ప్రకటించినప్పటి నుండే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
- By Balu J Published Date - 11:04 AM, Fri - 19 August 22
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం “ధమాకా” టైటిల్ ప్రకటించినప్పటి నుండే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దర్శకుడు త్రినాధ రావు నక్కిన తో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం ఇండస్ట్రీలో చాలా క్యూరియాసిటీని రేకెత్తించింది. ఆ తర్వాత విడుదలైన రవితేజ, శ్రీలీల ఇద్దరి ఫస్ట్ లుక్ ఆసక్తిని మరింత పెంచింది. ఈ రోజు, చిత్రంలోని మొదటి సింగిల్ `జింతాక్` లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మంచి చార్ట్‌బస్టర్ గా సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఒక సామూహిక, జానపద-నృత్య రీతితో ముందుకు వచ్చారు. బీట్స్ అన్నీ సరికొత్తగా పెప్సీగా ఉన్నాయి. బాణీలు కంపోజ్ చేయడంతో పాటు, భీమ్స్ సిసిరోలియో పాటకు గాత్రాన్ని కూడా అందించారు. ఈ రకమైన పాటలకు ప్రైమ్ ఛాయిస్ అయిన మంగ్లీ కూడా గొంతు కలిపారు. గాయకులు ఇద్దరూ తమ చురుకైన గానంతో పాటకు ఎనర్జీ చేకూర్చారు.
రవితేజ, శ్రీలీల మాస్ డ్యాన్స్‌లు ఈ పాటకు పెద్ద ఆకర్షణగా నిలిచాయి. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే పర్ఫెక్ట్ ఫోక్ సాంగ్ అనడంలో మరోమాటకు తావులేదు. ఇద్దరూ తమ ఆకర్షణీయమైన డ్యాన్స్‌లతో మరింత ఉత్సాహాన్ని జోడించారు. విజువల్స్ వైబ్రెంట్ గా ఇచ్చిన సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని కు చిత్ర యూనిట్ థ్యాంక్స్ చెబుతోంది. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో ధమాకాను నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ‘డబుల్ ఇంపాక్ట్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ధమాకాలో ప్రముఖ నటీనటులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేస్తున్నారు.
Related News
Ravi Teja: యూట్యూబ్ రికార్డులను బద్ధలు కొట్టిన రవితేజ టైగర్ నాగేశ్వర రావు మూవీ
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే రవితేజ గత చిత్రం టైగర్ నాగేశ్వరరావు మరోసారి వార్తల్లో నిలిచింది. కొన్ని నెలల క్రితం యూట్యూబ్ లో అధికారికంగా విడుదలైన ఈ సినిమా హిందీ వెర్షన్ 100 మిలియన్ వ్యూస్, 1 మిలియన్ లైక్స్ దాటింది. నార్త్ ఇండియన్ సినీ ప్రియుల నుంచి విశేష స్పందన రావడంతో చిత్రబృందం ఆనందంలో మున