NTR : గోవాలో దేవర.. ఎన్టీఆర్ సినిమా ఏం జరుగుతుంది..?
NTR యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా గురించి వచ్చే ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ముఖ్యంగా దేవర రెండు పార్టులుగా
- Author : Ramesh
Date : 30-10-2023 - 4:05 IST
Published By : Hashtagu Telugu Desk
NTR యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా గురించి వచ్చే ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ముఖ్యంగా దేవర రెండు పార్టులుగా తీస్తున్నారని తెలియగానే ఫ్యాన్స్ లో అంచనాలు డబుల్ అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేస్తుంది. ప్రస్తుతం దేవర యూనిట్ అంతా గోవాలో ఉంది. గోవా లో కీలక సన్నివేషాలు షూటింగ్ జరుపుకుంటుంది.
కొరటాల శివ(Koratala Siva) ఈ షెడ్యూల్ లో హీరో హీరోయిన్ మధ్య ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేస్తున్నారట. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ గా చేస్తున్న జాన్వి కపూర్ (Janhvi Kapoor) కూడా పాల్గొన్నదని తెలుస్తుంది. దేవర గోవా షెడ్యూల్ పూర్తైతే సగానికి పైగా సినిమా కంప్లీట్ అయినట్టే అని తెలుస్తుంది.
Also Read : Bigg Boss 7 : బిగ్ బాస్ హౌస్ లో ఐరన్ మ్యాన్. అతను నామినేట్ చేస్తే ఎలిమినేట్ పక్కా..!
దేవర (Devara) సినిమా తో మరోసారి రికార్డుల మీద కన్నేశాడు తారక్. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న దేవర సినిమా గ్లోబల్ వైజ్ ట్రెండ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ తారక్ నటనా ప్రతిభ గురించి ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రశంసలు వచ్చాయి. దేవరలో మరోసారి తారక్ (Tarak) నట విశ్వరూపం చూపిస్తారని తెలుస్తుంది.
ఈ సినిమాకు అనిరుద్ (Anirud) మ్యూజిక్ కూడా మరో హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. దేవర పార్ట్ 1 2024 ఏప్రిల్ 5న రిలీజ్ లాక్ చేశారు. అయితే దేవర 2 మాత్రం వెంటనే కాకుండా మధ్యలో రెండు సినిమాలు చేశాక ఉంటుందని తెలుస్తుంది.
We’re now on WhatsApp : Click to Join