DevakiNandanaVasudeva: గల్లా అశోక్ సక్సెస్ టూర్ కు అభిమానులు బ్రహ్మ రథం
Devaki Nandana Vasudeva Success Tour : గల్లా అశోక్ ‘హీరో’ సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో చాలా యాక్టివ్ అయ్యాడు. ఎమోషన్స్, యాక్షన్ , డాన్స్ , యాక్టింగ్ ఇలా అన్నింట్లో కుమ్మేసాడు. అంతే కాదు స్కీన్ పై చాల అందంగా కనిపించి అమ్మాయిల హృదయాల్లో రాజకుమారుడు అయ్యాడు
- Author : Sudheer
Date : 01-12-2024 - 1:14 IST
Published By : Hashtagu Telugu Desk
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ (Galla Ashok) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva). జాంబిరెడ్డి, హనుమాన్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prashanth Verma) ఈ చిత్రానికి కథ అందించగా.. గుణ 369 ఫేం అర్జున్ జంధ్యాల (Arjun Jandyala) దర్శకత్వం వహించాడు. విభిన్న కథాంశంగా, మాస్ యాక్షన్ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా రిలీజ్ రోజు డీసెంట్ టాక్ తెచ్చుకుంది. గల్లా అశోక్ ‘హీరో’ సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో చాలా యాక్టివ్ అయ్యాడు. ఎమోషన్స్, యాక్షన్ , డాన్స్ , యాక్టింగ్ ఇలా అన్నింట్లో కుమ్మేసాడు. అంతే కాదు స్కీన్ పై చాల అందంగా కనిపించి అమ్మాయిల హృదయాల్లో రాజకుమారుడు అయ్యాడు.
ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతుండడం తో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడ్ చేసారు. ప్రమోషన్స్ లో మెుదట నెమ్మదించిన మేకర్స్, కలెక్షన్స్ ఊపందుకోవడంతో సివిమాను మరింతగా ఆడియన్స్ లోకి తీసుకువెళ్ళేందుకు ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ముఖ్యంగా బీ,సీ సెంటర్స్ లో సినిమా హౌస్ ఫుల్ బోర్డ్స్ తో రన్ అవుతుంది. ఇక వర్కింగ్ డేస్ లోనూ డీసెంట్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. కమర్షియల్ సినిమా కి డివోషనల్ టచ్ ఇవ్వడం భారీ యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో హీరో గల్లా అశోక్ తెలుగురాష్ట్రాల్లో సక్సెస్ టూర్ చేపట్టాడు. అందులో భాగంగా థియేటర్స్ విజిట్ చేస్తున్నాడు. ఆ ఊరు ఈ ఊరు అని తేడా లేకుండా ఈ సక్సెస్ టూర్ లో గల్లా అశోక్ కు ప్రేక్షకులు , ఘట్టమనేని అభిమానులు బ్రహ్మ రథం పడుతున్నారు. ఈ వారం మరే ఇతర సినిమాలు లేకపోవడంతో దేవకి నందన మరింత కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.
Read Also : Prisoner Escaped : నకిలీ బెయిల్ పత్రాలతో చంచల్‌గూడ జైలు నుంచి ఖైదీ పరార్