Deva : ఒకే పేరుతో ముగ్గురు హీరోలు..?
- By Ramesh Published Date - 11:03 PM, Wed - 4 September 24
అదేంటో ఒక సినిమాలో ఫాలో అవుతున్న ట్రెండ్ మరో సినిమాలో ఫాలో అవ్వడం కామనే కానీ కొన్నిసార్లు కావాలని జరుగుతుందో లేదా అలా యాదృచ్చికంగా అవుతుందో తెలియదు కానీ సినిమాల విషయంలో కొన్ని ఒకేరకంగా ఉంటాయి. ప్రస్తుతం త్వరలో రాబోతున్న ఒక రెండు పెద్ద సినిమాల హీరోల పేర్లు విషయంలో ఈ ట్రెండ్ కొనసాగుతుంది. ఇంతకీ ఏంటా సినిమాలు అంటే ఎన్ టీ ఆర్ దేవర, రజినికాంత్ కూలీ. ఈ రెండు సినిమాలు రెండు డిఫరెంట్ స్టోరీస్ తో వస్తున్నాయి.
ఐతే ఈ సినిమాల్లో హీరోల పేరు దేవా (Deva)నే అవ్వడం విశేషం. ఎన్టీఆర్ (NTR) దేవరలో దేవా పాత్రలో నటిస్తున్నాడు. ఇక కూలీ సినిమాలో రజిని పాత్ర పేరు కూడా దేవానే. ఐతే లాస్ట్ ఇయర్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో కూడా దేవా పాత్రలోనే నటించాడు. దేవా పేరుకి ఉన్న క్రేజ్ అలాంటిది కాబట్టే అందరు ఆ పేరు పెట్టుకుంటున్నారు.
కావాలని పెట్టకపోయినా సరే కొద్దిపాటి గ్యాప్ తో వస్తున్న రెండు సినిమాల్లో హీరో పేరు దేవానే అవ్వడం ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. దేవర సినిమా మీద తారక్ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు.
ఐతే ఈ సినిమా కచ్చితంగా ఫ్యాన్స్ అందరు కాలర్ ఎగరేసేలా ఉంటుందని తారక్ చెప్పాడు. సినిమా అలానే ఉంటే మాత్రం తారక్ సెన్సేషన్ సృష్టిస్తాడని చెప్పొచ్చు. ప్రభాస్, తారక్, రజిని ముగ్గురు కూడా ఒకే పాత్ర పేరుతో నటించడం అలా కుదిరింది.
Related News
Prabhas Salaar 2 : ప్రభాస్ సలార్ 2 లో మలయాళ స్టార్..?
దేవ వర్సెస్ వరద రాజ మన్నార్ మధ్య ఫైటింగ్ సెకండ్ పార్ట్ లో అంతకుమించి అనిపించేలా ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్. సలార్ 2 శౌర్యాంగ పర్వం