David Warner : ‘రాబిన్ హుడ్’ సినిమా నుంచి డేవిడ్ వార్నర్ వచ్చేసాడు.. ఫ్యాన్స్ కి పండగే..
తాజాగా నేడు ఈ సినిమా నుంచి డేవిడ్ వార్నర్ లుక్ రిలీజ్ చేసారు.
- By News Desk Published Date - 12:13 PM, Sat - 15 March 25

David Warner : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుగు వాళ్లకు బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. గతంలో వార్నర్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడి కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో తెలుగు సినిమాల హీరోల డైలాగ్స్, సాంగ్స్ లను రీల్స్ చేసి ఇక్కడ ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. తెలుగు సినిమాలు, తెలుగు ఆడియన్స్ మీద ప్రేమని చూపించాడు. దీంతో డేవిడ్ ని ఇక్కడే ఉండిపొమ్మని, ఇక్కడి సినిమాల్లో యాక్ట్ చేయమని ఫ్యాన్స్ అడిగారు.
ఇటీవల మైత్రి నిర్మాతలు డేవిడ్ వార్నర్ నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో నటించాడు అని ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో నితిన్, శ్రీలీల జనతగా వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా మార్చ్ 28న రిలీజ్ కానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.
తాజాగా నేడు ఈ సినిమా నుంచి డేవిడ్ వార్నర్ లుక్ రిలీజ్ చేసారు. బౌండరీల నుంచి బాక్సాఫీస్ కి వెల్కమ్. డేవిడ్ వార్నర్ ఇండియన్ సినిమాలోకి అంటూ రాబిన్ హుడ్ పోస్టర్ రిలీజ్ చేసారు. దీంతో డేవిడ్ వార్నర్ ని ఇష్టపడే తెలుగు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్టేడియంలో అదరగొట్టిన డేవిడ్ వార్నర్ థియేటర్స్ లో ఏ రేంజ్ లో అదరగొడతాడో చూడాలి.

David Bhai
After shining and leaving a mark on the ground, it is time for him to shine on the silver screen 💥💥
Introducing the widely loved @davidwarner31 to Indian Cinema with #Robinhood in an exciting cameo ❤🔥
GRAND RELEASE WORLDWIDE ON MARCH 28th.@actor_nithiin @sreeleela14… pic.twitter.com/mVbvNMvouP
— Mythri Movie Makers (@MythriOfficial) March 15, 2025
Also Read : Priyanka Chopra : మహేష్ – రాజమౌళి సినిమా సెట్స్ లో ప్రియాంకచోప్రా హోలీ సెలబ్రేషన్స్.. ఫోటో వైరల్..