Pooja Hegde Reaction: సల్మాన్ ఖాన్ తో డేటింగ్.. పూజాహెగ్డే రియాక్షన్ ఇదే!
పూజాహెగ్డే సల్మాన్ తో డేటింగ్ (Dating) చేస్తుందని వార్తలు గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి.
- Author : Balu J
Date : 14-04-2023 - 11:51 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే (Pooja Hegde) బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ తో (Salman Khan) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గతకొంతకాలంగా ఈ బ్యూటీ సల్మాన్ తో డేటింగ్ (Dating) చేస్తుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సల్మాన్ వల్లనే పూజకు బాలీవుడ్ ఆఫర్ వచ్చిందనీ, అందుకే పూజ సల్మాన్ పై మనసు పారేసుకుందని రూమర్స్ వినిపించాయి.
ఈ నేపథ్యంలో పూజహెగ్డే, సల్మాన్ ఖాన్ నటించిన కానున్న కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా పూజ డేటింగ్ వార్తలపై రియాక్ట్ అయ్యింది. పూజా ఈటైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ప్రస్తుతం ఒంటరిగా (Single) ఉన్నానని, ఎవరితో డేటింగ్ చేయడం లేదని, తన దృష్టి కెరీర్ పై పెట్టినట్లు స్పష్టం చేసింది.
ఈ చిత్రంలో తాను సల్మాన్ కు ఎలా కనెక్ట్ అవుతాననో అని చెప్పింది. రౌడీల చేతిలో బంధీ అయిన పూజ, ఆమె కుటుంబాన్ని కాపాడే పాత్రలో సల్మాన్ ఖాన్ నటించాడు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించారు. వెంకటేష్ దగ్గుబాటి (Daggubati Venkatesh), జగపతి బాబు, షెహనాజ్ గిల్, ఇతరులు కూడా నటించారు. డేటింగ్ పుకార్లు ఉన్నప్పటికీ, పూజా సల్మాన్‌తో కలిసి పని చేయడం గొప్ప అనుభవం అని చెప్పింది. అతని వ్యక్తిత్వం, నిజాయితీని ప్రశంసించింది.
Also Read: Posani: పోసాని కృష్ణ మురళికి కరోనా.. ఇది మూడోసారి!