HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Daaku Maharaaj Movie Shooting Completed When Was The Release

Daaku Maharaaj Movie Update: డాకు మహారాజ్ మూవీ షూటింగ్ పూర్తి.. విడుదల ఎప్పుడంటే?

బాల‌కృష్ణ డాకు మహారాజ్ చిత్ర షూటింగ్ పూర్తయినట్లు బుధవారం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మాస్ యాక్షన్ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.

  • By Kode Mohan Sai Published Date - 03:28 PM, Wed - 4 December 24
  • daily-hunt
Daaku Maharaaj Movie Update
Daaku Maharaaj Movie Update

బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 109వ సినిమా డాకు మహారాజ్ షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ తాజాగా ఓ అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఈ మాస్ యాక్షన్ మూవీ షూటింగ్ పూర్తి అయినట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. డాకు ఇన్ యాక్షన్ పేరుతో ఒక వర్కింగ్ స్టిల్‌ను మేకర్స్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేశారు. ఈ స్టిల్‌లో బాలకృష్ణతో పాటు డైరెక్టర్ బాబీ కూడా కనిపిస్తున్నారు, ఆయన సన్నివేశం గురించి వివరిస్తున్నారు. కాగా, డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపించబోతున్నది. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

It’s a wrap! 💥 💥

Our #DaakuMaharaaj is ready to unleash the MASS STORM on the big screens this Sankranti. 🔥⚡️

Teaser – https://t.co/2zDUyNF8aJ

Get ready for 𝐏𝐨𝐰𝐞𝐫-𝐏𝐚𝐜𝐤𝐞𝐝 𝐄𝐗𝐏𝐋𝐎𝐒𝐈𝐎𝐍 on Jan 12, 2025 in Cinemas Worldwide. 💪💪
𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺… pic.twitter.com/DtRzcIiNGQ

— Bobby (@dirbobby) December 3, 2024

ఇటీవ‌లే డాకు మహారాజ్ టీజర్‌ను విడుదల చేశారు. “ఈ క‌థ వెలుగును పంచే దేవుళ్లది కాదు… చీక‌టిని శాసించే రాక్ష‌సులది కాదు… ఆ రాక్ష‌సుల‌ను ఆడించే రావ‌ణుడిది కాదు… ఈ క‌థ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది… గండ్ర గొడ్డ‌లి ప‌ట్టిన య‌మ‌ధ‌ర్మ‌రాజుది… మ‌ర‌ణాన్నే వ‌ణికించిన మ‌హారాజుది” అనే డైలాగ్‌తో టీజర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది.

మేక‌ర్స్ టీజ‌ర్ ద్వారా డాకు మహారాజ్ క‌థ బాగా సరికొత్త బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌బోతుంద‌ని అభిమానులకు హింట్ ఇచ్చారు. డాకు మహారాజ్ చిత్రంలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని ఒక కొత్త అవతారంలో, దర్శకుడు బాబీ ఆవిష్క‌రించ‌బోతున్నారన్న సమాచారం కూడా అందింది.

డాకు మహారాజ్ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై, సూర్యదేవర నాగవంశీ మరియు త్రివిక్ర‌మ్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఈ సంక్రాంతి కానుకగా మిమల్ని అలరించబోతుంది. అయితే,  డాకు మహారాజ్ సినిమాకు పోటీగా, రామ్ చ‌ర‌ణ్ నటించిన గేమ్ ఛేంజర్ (జనవరి 10) మరియు వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం (జనవరి 14) కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ మూడు సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.

డాకు మహారాజ్ తర్వాత, బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా చేయబోతున్నాడు. బ్లాక్ బస్టర్ అఖండ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే అఖండ 2 యొక్క పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాకు బాలకృష్ణ కూతురు తేజస్విని ప్ర‌జెంట‌ర్‌గా వ్యవహరిస్తున్నారు.

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్' షూటింగ్ పూర్తి – షూటింగ్ పూర్తి చేసుకున్న 'డాకు మహారాజ్' చిత్రం – సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న భారీస్థాయిలో విడుదల #DakuMaharaj #NBK #Tollywood #NandamuriBalakrishna #HashtagU pic.twitter.com/m8ythFXtF3

— Hashtag U (@HashtaguIn) December 4, 2024


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2025 Sankranti Telugu Movies
  • bobby kolli
  • Daaku Maharaaj
  • Daaku Maharaaj Shooting Wraps Up
  • Nandamuri Bala Krishna

Related News

    Latest News

    • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

    • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd