Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Chor Bazaar Movie Press Meet

Chor Bazaar: ‘‘చోర్ బజార్’’ ఒక కలర్ ఫుల్ సినిమా

ఆకాశ్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. దర్శకుడు జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు.

  • By Balu J Updated On - 02:41 PM, Wed - 15 June 22
Chor Bazaar: ‘‘చోర్ బజార్’’ ఒక కలర్ ఫుల్ సినిమా

ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. దర్శకుడు జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన “చోర్ బజార్” సినిమా ప్రెస్ మీట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత వీఎస్ రాజు మాట్లాడుతూ..దర్శకుడు జీవన్ రెడ్డి, నేను మంచి మిత్రులం. పదిహేనేళ్లు కలిసి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేశాం. తను సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తున్నప్పుడు ముందు కమర్షియిల్ సినిమాలు తెరకెక్కించు అని చెప్పేవాడిని. జీవన్ రెడ్డి చెప్పిన కథ నచ్చి ఒక మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ చేద్దామని ఈ సినిమా నిర్మించాం. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. అన్నారు.

దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ…మా స్నేహితుడు వీఎస్ రాజు నా సినిమాకు నిర్మాత కావడం సంతోషంగా ఉంది. ఒక కలర్ పుల్ సినిమా చేద్దామని ఆయన అనేవారు. అన్నట్లుగానే మంచి కమర్షియల్, కలర్ ఫుల్ సినిమా చేశాం. నాతో పాటు నా టెక్నికల్ టీమ్ వందశాతం ఎఫర్ట్ పెట్టి పనిచేశారు. ఈ సినిమా బాగుందంటే ఆ క్రెడిట్ నా టీమ్ కు ఇస్తాను. ఒక యువ హీరో ఈ కథకు కావాలి అనుకున్నప్పుడు ఆకాష్ నా మనసులో మెదిలారు. ఆయన బచ్చన్ సాబ్ అనే ఈ క్యారెక్టర్ లో పర్పెక్ట్ గా నటించారు. అని అన్నారు.

హీరోయిన్ గెహనా సిప్పీ మాట్లాడుతూ..చోర్ బజార్ సినిమాలో లవ్ యాక్షన్ డ్రామా రొమాన్స్ అన్నీ ఉన్నాయి. మీకు తప్పకుండా సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈ సినిమాకు టీమ్ ఎంతో కష్టపడి పనిచేశారు. నాకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. అని చెప్పింది. ఆకాష్ పూరి మాట్లాడుతూ…సినిమా మొదలైనప్పటి నుంచి ఎప్పుడు థియేటర్ లో ప్రేక్షకులకు చూపిద్దామా అని ఎదురుచూస్తున్నాం. మా టీమ్ గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతాను. మా చిత్రంలోని తొలి పాట విడుదలైన ప్పటి నుంచి నుంచి మొన్న ట్రైలర్ రిలీజ్ వరకు ఆదరణ చూపిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా ట్రైలర్ కు మూడున్న మిలియన్ వ్యూస్ వచ్చాయి. జడ పాటకు
సోషల్ మీడియాలో వేల కొద్దీ రీల్స్ చేస్తున్నారు. మేము చేస్తున్న ప్రయత్నానికి తోడు యూవీ క్రియేషన్స్ కలవడం మా సినిమా స్థాయిని
పెంచేసింది. వంశీ, ప్రమోద్ గారికి థాంక్స్. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. మీ కుటుంబంతో వచ్చి సినిమాను ఎంజాయ్ చేయండి. అన్నారు.

Tags  

  • Akash Puri
  • Chor Bazaar
  • latest tollywood news
  • press meet

Related News

R Narayana Murthy: నారాయణమూర్తి ఇంట్లో విషాదం!

R Narayana Murthy: నారాయణమూర్తి ఇంట్లో విషాదం!

నటుడు ఆర్. నారాయణమూర్తి తల్లి ఇకలేరు. తల్లి చిట్టెమ్మ ఈ ఉదయం కన్నుమూశారు.

  • Bimbisara Trailer: ‘బింబిసార’ ట్రైలర్ కు  టెరిఫిక్ రెస్పాన్స్‌!

    Bimbisara Trailer: ‘బింబిసార’ ట్రైలర్ కు  టెరిఫిక్ రెస్పాన్స్‌!

  • Ramarao On Duty: మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించేలా ‘నా పేరు సీసా’

    Ramarao On Duty: మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించేలా ‘నా పేరు సీసా’

  • Nani Look: నాని టెర్రిఫిక్ అవతార్.. దసరా షూటింగ్ స్టార్ట్!

    Nani Look: నాని టెర్రిఫిక్ అవతార్.. దసరా షూటింగ్ స్టార్ట్!

  • Chandrababu Naidu: పోలీసులపై బాబు ‘ప్రైవేట్’ వార్

    Chandrababu Naidu: పోలీసులపై బాబు ‘ప్రైవేట్’ వార్

Latest News

  • Coconut: దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే అర్థం ఏంటి.. దేనికి సంకేతం!

  • Kidney Stones: కిడ్నీలో రాళ్లను న్యాచురల్ గా నివారించేందుకు బెస్ట్ టిప్స్ ఇవే!

  • Vastu Tips : విష్ణుప్రియ అపరాజితను ఈ దిక్కున పెట్టండి…ఇంట్లోకి ఐశ్వర్యం తెస్తుంది..!!

  • Reduce Pain: మందు లేకుండానే నొప్పిని తగ్గించే పనికరం.. ఈ వివరాలు తెలుసుకోండి!

  • Vastu tips : భోజనం చేసేటప్పుడు ఏవైపు కూర్చుంటే మంచిదో తెలుసా..:?

Trending

    • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

    • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

    • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: