Kangana and Vikram: కంగనా రనౌత్ మూవీలో స్టార్ హీరో గెస్ట్ రోల్
చియాన్ విక్రమ్ విభిన్న ప్రాతలకు కేరాఫ్ అడ్రస్. ఏ పాత్రకైనా ప్రాణం పెడతాడు.
- By Balu J Published Date - 04:11 PM, Mon - 3 October 22
చియాన్ విక్రమ్ విభిన్న ప్రాతలకు కేరాఫ్ అడ్రస్. ఏ పాత్రకైనా ప్రాణం పెడతాడు. హీరో విక్రమ్ డెడికేషన్ చూసిన పత్రిసారి ప్రేక్షకులకు ఓ అనుభూతి వస్తుంది. ఇటీవల విక్రమ్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చిత్రం పొన్నియన్ సెల్వన్- 1. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ మూవీలో విక్రమ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే హీరో విక్రమ్ మరో పౌరాణిక మూవీలో కీలక పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది.
హీరో విక్రమ్ పొన్నియన్ సెల్వన్- 1 విడుదలై వారం రోజులు కూడా కాకముందే బాలీవుడ్లో ఓ పౌరాణిక చిత్రంలో కీ రోల్ పోషించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కంగనా రనౌత్ కథానాయికగా వస్తున్న ‘సీత ది ఇంకార్నేషన్’ అనే సినిమాను రాముడి పెళ్లికి ముందు కథతో చూపిస్తుండగా.. విక్రమ్ పోషిస్తున్న ఈ గెస్ట్ రోల్ ఈ చిత్రానికి కీలకం కాబోతుందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి అలౌకిక్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
సీత పుట్టుక, జనక మహారాజు ఆమెను దత్తత తీసుకోవడం వంటి అంశాలను ఇందులో ఆవిష్కరించబోతున్నట్లు తెలిసింది. అతిథి పాత్రే అయినా సినిమాలో ఆయన చాలా సమయం పాటు కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గెస్ట్ రోల్ గురించే దర్శకుడు.. విక్రమ్‌ను కలిసినట్లు సమాచారం. క్యారెక్టర్ నచ్చడంతో విక్రమ్ ఈ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సీత ది ఇంకార్నేషన్ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు. పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
Related News
Kangana Ranaut: కంగనా రనౌత్ కు పోటీగా మరో బాలీవుడ్ నటి..? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే..?
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి బాలీవుడ్ నటి, బిజెపి అభ్యర్థి కంగనా రనౌత్ (Kangana Ranaut)పై కాంగ్రెస్ పార్టీ యామీ గౌతమ్ (Yami Gautam)కు టికెట్ ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతోంది.