Chiranjeevi : సంక్రాంతి సినిమాల రిలీజ్ లపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. దిల్ రాజుపై కూడా..
నేడు హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ సంక్రాంతి సినిమాల పై, థియేటర్స్ ఇష్యూ పై, దిల్ రాజు గురించి వ్యాఖ్యలు చేశారు.
- By News Desk Published Date - 10:26 PM, Sun - 7 January 24

ఈ సంక్రాంతికి(Sankranthi) ఎప్పుడూ లేనంతగా చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఫైనల్ గా అయిదు సినిమాలు బరిలో నిలిచాయి. దీంతో థియేటర్స్ సమస్య ఎదురైంది. దిల్ రాజు(Dil Raju), పలువురు నిర్మాతలు కూర్చొని మాట్లాడి మొత్తానికి ఒక సినిమా అయితే తప్పించారు. చివరగా ఈ సంక్రాంతికి తెలుగు నుంచి గుంటూరు కారం(Guntur Kaaram), హనుమాన్(Hanuman), సైంధవ్(Saindhav), నా సామిరంగ(Naa Saami Ranga) సినిమాలు రియలైజ్ కాబోతున్నాయి.
అయితే థియేటర్స్ ఇష్యూ ఇంకా నడుస్తుంది. టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల రిలీజ్ చర్చగా మారింది. దిల్ రాజు థియేటర్స్ హనుమాన్ సినిమాకి ఇవ్వట్లేదని, తొక్కేస్తున్నాడని కూడా కామెంట్స్ వచ్చాయి.
తాజాగా నేడు హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ సంక్రాంతి సినిమాల పై, థియేటర్స్ ఇష్యూ పై, దిల్ రాజు గురించి వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి మాట్లాడుతూ.. సంక్రాంతి సినిమాలకు పరీక్షా కాలం. హనుమాన్ చిత్రానికి థియేటర్లు దొరకడం లేదని నిర్మాతలు బాధపడ్డారు. థియేటర్ల విషయంలో నిర్మాతలు బాధపడాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు. మొదటి రోజు కాకపోతే రెండో రోజు, కుదరకపోతే మూడో రోజు చూస్తారు. దిల్ రాజు సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఆయనకు ఈ సీజన్ లో ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు ఇవ్వాలో తెలుసు. ఖైదీ నెం.150 సమయంలో శతమానంభవతి విడుదల చేశారు. శతమానంభవతి రిలీజ్ కొంచెం ఆలస్యం చేయవచ్చు కదా అని దిల్ రాజును అడిగాను. రెండు పెద్ద సినిమాల మధ్య మా సినిమా కూడా ప్రేక్షకులు చూస్తారని దిల్ రాజు చెప్పాడు. దిల్ రాజు చెప్పినట్లే శతమానంభవతి బాగా ఆడింది. ఇప్పుడు హనుమాన్ కూడా బాగా ఆడుతుంది. సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాలు ఆడాలి, పరిశ్రమ పచ్చగా ఉండాలి అని అన్నారు. దీంతో చిరు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Anjali : శ్రీలీల వరుస సినిమాలు చేస్తుంది.. మీరేమో? అంటూ పోల్చడంతో ఫైర్ అయిన అంజలి..