Lifetime Achievement Award : లండన్లో పురస్కారం అందుకున్న చిరంజీవి
Lifetime Achievement Award : దశాబ్దాలుగా సినీ రంగంలో తన నటనా ప్రస్థానంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవికి వరుసగా అంతర్జాతీయ స్థాయిలో గౌరవాలు దక్కుతున్నాయి
- By Sudheer Published Date - 10:37 AM, Thu - 20 March 25

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) సినీ పరిశ్రమలో చేసిన విశేషమైన కృషికి గుర్తింపుగా యూకే పార్లమెంటు జీవన సాఫల్య పురస్కారాన్ని (Chiranjeevi Lifetime Achievement Award) ప్రదానం చేసింది. లండన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును స్వీకరించారు. దశాబ్దాలుగా సినీ రంగంలో తన నటనా ప్రస్థానంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవికి వరుసగా అంతర్జాతీయ స్థాయిలో గౌరవాలు దక్కుతున్నాయి. గతేడాది ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం, పద్మవిభూషణ్ అవార్డులను అందుకున్న ఆయన ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది.
ఈ అవార్డుపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందిస్తూ.. చిరంజీవి ప్రతిభకు ఇదే నిదర్శనం అని తెలిపారు. ‘ఒక మధ్య తరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా సినీ రంగంలో ప్రవేశించి, స్వశక్తితో మెగాస్టారుగా ఎదిగిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ప్రేరణ’ అని పేర్కొన్నారు. అంతేకాదు తన అన్నయ్యను తండ్రి సమానుడిగా భావిస్తానని, జీవితంలో ఆయన చూపిన మార్గం వల్లే తాను ముందుకు వెళ్లగలుగుతున్నానని ట్వీట్ చేశారు.
UPI Update : మీరు షాపింగ్‌లో వినియోగించే.. యూపీఐ ఫీచర్‌కు గుడ్‌బై !
ఈ పురస్కారం చిరంజీవి కీర్తిని మరింత పెంచిందని, ఆయన సినీ ప్రస్థానం భారతీయ సినీ రంగానికి గర్వకారణమని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి వంటి గొప్ప నటుడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం, భారతీయ చిత్రసీమ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే సూచికగా మారిందని సినీ పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. లండన్లో జరిగిన ఈ ఘనతతో మెగాస్టార్ మేనియా మరికొన్ని రోజుల పాటు సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.
యునైటెడ్ కింగ్ డం పార్లమెంట్ అందించనున్న జీవిత సాఫల్య పురస్కారం అన్నయ్య @KChiruTweets గారి కీర్తిని మరింత పెంచనుంది
సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి, స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో, చిత్ర రంగంలో మెగాస్టార్ గా ఎదిగి, నాలుగున్నర దశాబ్దాలుగా… pic.twitter.com/aIk6wxCk2q
— Pawan Kalyan (@PawanKalyan) March 20, 2025