Chaiyya Chaiyya Song : ‘ఛయ్యా.. ఛయ్యా’ సాంగ్ మహేష్ బాబు కజిన్ చేయాల్సింది.. కానీ చివరికి మలైకా ఎంట్రీ..
సూపర్ హిట్ సాంగ్ 'ఛయ్యా.. ఛయ్యా'(Chaiyya Chaiyya). ఈ పాట అప్పటిలో నేషనల్ వైడ్ ఒక సెన్సేషన్.
- Author : News Desk
Date : 03-10-2023 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్(Bollywood) బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), అందాల భామ మలైకా అరోరా (Malaika Arora) కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ సాంగ్ ‘ఛయ్యా.. ఛయ్యా'(Chaiyya Chaiyya). ఈ పాట అప్పటిలో నేషనల్ వైడ్ ఒక సెన్సేషన్. మణిరత్నం తెరకెక్కించిన ‘దిల్ సే’ (Dil Se) సినిమాలో ఈ పాటని తెరకెక్కించారు. ఒక రన్నింగ్ ట్రైన్ పై ఈ మొత్తం సాంగ్ ని చిత్రీకరించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ క్యాచీ ట్యూన్ కి షారుఖ్ అండ్ మలైకా వేసిన స్టెప్పులు ప్రతి ఒక్కర్ని ఉర్రూతలూగించాయి.
ఇక ఈ పాటతో మలైకా కూడా నేషనల్ వైడ్ ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పటికి మలైకా ఎక్కడైనా కనిపిస్తే.. ముందుగా ఈ పాట గురించే అడుగుతారు. అయితే అంతటి ఫేమ్ ని తెచ్చిపెట్టిన ఈ సాంగ్ కోసం మలైకా మొదటి ఛాయస్ కాదు. ఈ పాటలో షారుఖ్ తో కలిసి స్టెప్పులు వేయడానికి మణిరత్నం ముందుగా.. మహేష్ బాబు కజిన్ ని అనుకున్నాడు. మహేష్ వైఫ్ నమ్రతా సిస్టర్ ‘శిల్ప శిరోద్కర్’ (Shilpa Shirodkar) ఈ సాంగ్ ని చేయాల్సింది. మూవీ టీం అంతా కూడా ఆమెనే ఫైనల్ చేసుకున్నారు.
అయితే చివరి క్షణంలో మణిరత్నం శిల్పా కొంచెం లావుగా ఉంది అని చెప్పి.. మలైకా అరోరా పేరుని చెప్పడం, ఆమె ఎంట్రీ ఇవ్వడం, సాంగ్ లో అదిరే డాన్స్ వేయడం జరిగిపోయింది. అలా నమ్రతా సిస్టర్ శిల్పకి ఆ సాంగ్ మిస్ అయ్యిపోయింది. ఇక ఈ సాంగ్ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యిపోయిన మలైకా.. ఆ తరువాత బాలీవుడ్ పలు సూపర్ హిట్ సాంగ్స్ లో మెరిసింది. ఇక టాలీవుడ్ లో మహేష్ బాబుతో కలిసి కూడా ఒక సాంగ్ చేసింది. అతిథి మూవీలో ‘రాత్రయినా నాకు ఓకే’ సాంగ్ మహేష్ కలిసి చిందులేసింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లో ‘కెవ్వు కేక’ అంటూ ఒక ఊపు ఊపేసింది.
