HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chaitu Revenge On Samantha

Chaitu : ఫస్ట్ వైఫ్ ప్రపోజ్ చేసిన రోజే..సెకండ్ వైఫ్ తో ఎంగేజ్మెంట్..చైతు ఏమన్నా రివెంజా..!!

చైతు కు సమంత లవ్ ప్రపోజ్ చేసిన తేదీనే ఇప్పుడు కాబోయే భార్యతో నిశ్చితార్థం చేసుకున్నాడని సోషల్ మీడియా లో నెటిజన్లు , ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు

  • Author : Sudheer Date : 08-08-2024 - 7:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chaitu Revenge
Chaitu Revenge

సమంత తనకు ప్రపోజ్ చేసిన రోజే నాగచైతన్య ప్రేయసి శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏమాయ చేసావే (Yemaya Chesave) చిత్రంతో సమంత (Samantha) మాయలో పడిన చైతు..కొంతకాలం వరకు రహస్య ప్రేమ కొనసాగించి..ఆ తర్వాత ఇరు పెద్దల సమక్షంలో పెళ్లి (Naga Chaitanya Samantha wedding) చేసుకున్నాడు. కానీ వీరి వివాహ బంధం ఎంతోకాలం సాగలేదు. పెళ్లైన కొంతకాలానికే మనస్పర్థలు రావడం తో కోర్ట్ ద్వారా విడాకులు తీసుకొని ఎవరి..దారి వారు చూసుకున్నారు. విడాకుల తర్వాత చైతు సినిమాల తో బిజీ గా ఉన్నప్పటికీ..సమంత మాత్రం ఓ ప్రాణాంతక వ్యాధి బారిన పడి చావు అంచుల వరకు వెళ్లి దేవుడి దయ తో క్షేమంగా బయటపడింది. ప్రస్తుతం ఆరోగ్యం ఫై శ్రద్ద పెట్టి సినిమాలకు దూరమైంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక చైతు మాత్రం సమంత తో విడాకుల అనంతరం నటి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) ప్రేమలో పడ్డాడు. వీళ్లిద్ద‌రూ త‌ర‌చూ జంట‌గా క‌నిపించ‌డంతో ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ చైతూ కానీ శోభిత కానీ ఎప్పుడూ ఈ విష‌యంపై నోరు విప్ప‌లేదు. త‌మ ప‌ర్స‌న‌ల్ లైఫ్ త‌మ‌కుంద‌ని, వ్య‌క్తిగ‌త విష‌యాల్లో త‌మ‌కు ప్రైవ‌సీ కావాలంటూ జ‌వాబు దాట‌వేసేవారు. అయితే ఎట్ట‌కేల‌కు ఈరోజు ఇద్ద‌రూ సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఒకటయ్యారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈరోజు గురువారం ఉద‌యం 9 గంట 42 నిమిషాల‌కు నిశ్చితార్థం జరుపుకున్నారు. త‌మ కుటుంబంలోకి శోభిత‌ను మ‌నస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామంటూ నాగార్జున ట్వీట్ చేసి చైతు రెండో పెళ్లి గురించి అధికారిక ప్రకటన చేసాడు. ఈ మేరకు చైతన్య, శోభిత నిశ్చితార్థం ఫొటోలను ఎక్స్ లో పంచుకున్న నాగార్జున వారిద్దరు జీవితాంతం ప్రేమగా, సంతోషంగా కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇదంతా బాగానే ఉంది కానీ చైతు కు సమంత లవ్ ప్రపోజ్ చేసిన తేదీనే ఇప్పుడు కాబోయే భార్యతో నిశ్చితార్థం చేసుకున్నాడని సోషల్ మీడియా లో నెటిజన్లు , ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చైతు -సమంత జంటగా నటించిన ‘ఏమాయ చేశావే’ రిలీజయ్యాక ఆగస్టు 8వ తేదీన సమంత ప్రపోజ్ చేశారని చెబుతున్నారు. దీంతో ఇదేరోజు ఎంగేజ్మెంట్ చేసుకోవడంలో ఆంతర్యం ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే, ఈ శుభకార్యానికి ముందే చైతూ తన మాజీ భార్యతో ఉన్న ఫొటోలను ఇన్స్టా నుంచి తొలగించి, కేవలం ‘మజిలి’ సినిమా ఫొటోలే మాత్రమే ఉంచాడు.

ఇక శోభిత విషయానికి వస్తే.. ఏపీలోని తెనాలిలో 1993, మే 31న వేణుగోపాల్ రావు, శాంతరావు దంపతులకు జన్మించింది. ఆమెది బ్రాహ్మణ కుటుంబం. శోభిత ధూళిపాళ్ల తండ్రి మర్చంట్ నేవీలో ఇంజనీర్‌గా పనిచేసేవారు. తల్లి గవర్నమెంట్ టీచర్‌. పదహారేళ్లూ వచ్చే వరకు విశాఖపట్నంలోనే పెరిగిన శోభిత.. వైజాగ్​లోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్​లో తన చదువు​ పూర్తి చేశారు. ఆ తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా ముంబైకి మారారు. అక్కడ ముంబయి యూనివర్సిటీ, హెచ్.ఆర్ కాలేజ్​లో కామర్స్ & ఎకనామిక్స్ పూర్తి చేశారు. ఆమె సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలలో కూడా శిక్షణ తీసుకుంది.

శోభిత ముందుగా ఒక మోడల్​గా తన కెరీర్ మొదలుపెట్టి… 2013లో ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని.. “ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013” టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తరువాత ఇండియా తరపున “మిస్ ఎర్త్ 2013” పోటీల్లోనూ పాల్గొంది. కానీ అక్కడ టైటిల్​ గెలుచుకోలేకపోయింది. ఆ తర్వాత 2016లో సినీ రంగ ప్రవేశం చేశారు. ముందుగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె..తెలుగు లో అడివి శేషుతో కలిసి గూఢచారి, మేజర్ వంటి సినిమాల్లో నటించింది.

Read Also : Kerala Rains : కేరళకు మరోసారి భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • naga chaitanya 2nd wife
  • naga chaitanya and sobhita dhulipala
  • Samantha
  • sobhita dhulipala background

Related News

‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

Maa Inti Bangaram Overseas Collection: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్‌

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన తాజా చిత్రం ‘ మా ఇంటి బంగారం ’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్, మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రముఖ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం ప

  • ‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

    Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

Latest News

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd