HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Celebrities Wishes To Chiranjeevi

Celebrities Wishes to Chiranjeevi : పద్మ విభూషణ్ చిరంజీవికి విషెష్ ల వెల్లువ ..

  • Author : Sudheer Date : 26-01-2024 - 1:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chiru Padma
Chiru Padma

కేంద్రం ప్రకటించిన 2024 పద్మ అవార్డ్స్ (2024 Padma Awards) జాబితాలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి పద్మ విభూషణ్ (Padma Vibhushan ) దక్కిన సంగతి తెలిసిందే. చిరంజీవి కి పద్మ విభూషణ్ రావడం పట్ల యావత్ సినీ ప్రేమికులు , చిత్రసీమ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ..చిరంజీవి కి విషెష్ అందిస్తున్నారు.

సినీ ప్రియులు, అభిమానులు గుండెల్లో చెరగని ముద్ర వేసి కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్న చిరంజీవి ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న ఆయన్ను దేశంలోని రెండో అత్యున్నత పురస్కారం వరించడం తో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సినీరంగానికి చేసిన సేవలతో పాటు కరోనా, లాక్‌డౌన్‌లో సినీ కార్మికులను, సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

మెగాస్టార్‌కు పద్మ విభూషణ్‌ రావడం పట్ల మెగా కోడలు ఉపాసన హర్షం వ్యక్తం చేసింది. తన మావయ్యకు అభినందనలు చెబుతూ ట్వీట్‌ చేసింది. కంగ్రాట్స్‌ మామయ్య అంటూ పద్మ విభూషణ్‌ అవార్డులు పొందిన వారి లిస్ట్‌ను పోస్ట్‌ చేసింది. మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి చిరంజీవికి కంగ్రాట్స్‌ చెప్పారు. పద్మవిభూషణ్‌కు ఎంపికైన ప్రియమైన చిరు భాయ్‌కి హృదయపూర్వక అభినందనలు’ అంటూ పోస్ట్‌ చేశారు.

అలాగే తన తమ్ముడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ..అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య శ్రీ చిరంజీవి గారు చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా శ్రీ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను అని తెలిపారు. అలాగే టాలీవుడ్‌ హీరోలు నాని, మంచు విష్ణు, రాధిక శరతకుమార్‌; కిరణ్‌ అబ్బవరం, తేజా సజ్జా, సత్యదేవ్‌, అడివి శేష్‌, బింబిసార డైరెక్టర్‌ వశిష్ఠ, నటి ఖుష్బు సుందర్‌ తదితరులు ట్విటర్‌ ద్వారా చిరంజీవికి కంగ్రాట్స్‌ తెలియజేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక పద్మ విభూషణ్ రావడం పట్ల చిరంజీవి స్పందిస్తూ..పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలియగానే ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. మన దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు చాలా సంతోసంగా ఉంది. తమ కన్నతల్లి కుటుంబంలో పుట్టకపోయినా తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ఆశీస్సులు. నా సినీ కుటుంబం అండదండలు, నన్ను నీడలా నాతో ప్రతీ నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ఆదరణ, ప్రేమ, అభిమానుల కారణంగానే నేను ఈ స్థితిలో ఉన్నాను. నాకు దక్కిన గౌరవం మీది. మీరు నాపై చూపించిన ప్రేమకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వైవిధ్యమైన పాత్రలతో వినోదం పంచడానికి నా శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాను అని చిరంజీవి అన్నారు. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సహాయం అందిస్తున్నాను. కానీ నాపై మీరు చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను పెద్దగా ఇస్తున్నది గోరంత మాత్రమే. ఈ విషయం ప్రతీ క్షణం గుర్తు చేస్తుంది. నన్ను బాధ్యతగా నడుచుకొనేలా చేస్తుంది అని చిరంజీవి అన్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని నరేంద్రమోదీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్ అంటూ తన అనుభూతిని పంచుకొన్నారు.

Read Also : Balagam Venu Nani నానితో పీరియాడికల్ లవ్ స్టోరీ.. బలగం వేణు అదిరిపోయే ప్లాన్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Celebrities Wishes
  • chiranjeevi
  • Padma Awards 2024
  • Padma Vibhushan

Related News

Chiranjeevi Delivers a Big Shock to Exhibitors

Chiranjeevi: ఎగ్జిబిటర్లకు చిరంజీవి బిగ్ షాక్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల (ఎగ్జిబిటర్లు) మధ్య గత కొన్ని రోజులుగా నలుగుతున్న ‘పర్సంటేజ్ సిస్టమ్’ వివాదం క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించి, పరిశ్రమకు మేలు చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు. తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చిరంజీవి నివాసంలో ఆయనత

    Latest News

    • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

    • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd