Viral Tweet : ఒంటరితనం భరించలేవు.. సమంత ట్వీట్ వైరల్..!!
టాలీవుడ్ బ్యూటీఫుల్ పెయిర్...నాగచైతన్య-సమంతలు ఈ మధ్యే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
- Author : hashtagu
Date : 11-10-2022 - 10:49 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ బ్యూటీఫుల్ పెయిర్…నాగచైతన్య-సమంతలు ఈ మధ్యే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత ఎవరి దారిన వారు ఉన్నారు. సమంత కాస్త స్పీడ్ పెంచింది. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఆ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న సమంత…ఈ మధ్య కాస్త జోరు తగ్గించింది. తెలుగుతోపాటు హిందీలోనూ పలు సినిమాల్లో నటిస్తూ….పాన్ ఇండియా మూవీ యశోదకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
In case you needed to hear this as well..
YOU’LL NEVER WALK ALONE ♥️ pic.twitter.com/ot0xtkWTVT— Samantha (@Samanthaprabhu2) October 11, 2022
అయితే సమంత చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. క్రేజీ పోస్టర్ ను షేర్ చేస్తూ తన టీషర్ట్ పై ఉన్న కోట్ కనిపించేలా పిక్ షేర్ చేసింది. నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయలేవు అని అర్థం. సమంత ఎవరి ఉద్దేశించి మాట్లాడిందనేది మాత్రం క్లారిటీ ఇవ్వలే. నాగచైతన్య కోసమే సమంత ఈ ట్వీట్ చేసిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.