Video : BRO Trailer Talk టైం లేదు.. టైం లేదు చూసేయాల్సిందే
BRO Trailer Talk మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'బ్రో' (BRO) మూవీ ట్రైలర్ వచ్చేసింది.
- Author : Sudheer
Date : 22-07-2023 - 7:22 IST
Published By : Hashtagu Telugu Desk
BRO Trailer Talk : మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బ్రో’ (BRO) మూవీ ట్రైలర్ వచ్చేసింది. టైం లేదు..టైం లేదు అంటూ అందరి చేత ట్రైలర్ చూసేలా చేసింది. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ లు నటించిన ఈ మూవీ ఈ నెల 28 న అంటే సరిగ్గా మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా సాంగ్స్ , పోస్టర్స్ , పలు ప్రమోషన్స్ ఆకట్టుకోగా..శనివారం విడుదలైన ట్రైలర్ సినిమా ఫై అమాంతం అంచనాలు పెంచేసింది.
BRO ట్రైలర్ ప్రారంభంలో భస్మాసూరుడు అని ఒకడు ఉండేవాడు తెలుసా.. మీ మనుషులందరూ వాడి వారసులు. ఎవడి తలమీద వాడే పెట్టుకుంటాడు. ఇంకెవ్వడికి ఛాన్స్ ఇవ్వడు అంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చెప్పే డైలాగ్ ఆసక్తి పెంచింది. తేజ్(Sai Dharam Tej).. టైమ్ లేదు.. టైమ్ లేదు అంటూ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ను, ఆఖరికి ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేసి.. జీవితంలో పరుగులు పెడుతూ జీవిస్తుంటాడు. అదే సమయంలో అతనికి రోడ్డు ప్రమాదం జరుగుతుంది. సరిగ్గా అప్పుడే అతడికి కాలం విలువ తెలియజేయడం కోసం పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. ప్రతిదానికీ టైమ్ లేదంటావ్ కదా అదే నేను అంటూ పవన్ ను చూపించారు. ఓ రోడ్డు ప్రమాదం హీరో జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది? అనే కథాంశంతో సినిమాను తీర్చిదిద్దారని తెలుస్తుంది.
సినిమాలో పవన్ కళ్యాణ్ డ్రైవర్, వాచ్ మెన్, డాక్టర్ ఇలా విభిన్న గెటప్స్ తో కనిపించబోతున్నట్లు ట్రైలర్ లో చూపించారు. ఇక సినిమాలో ఎంటర్టైనింగ్ కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ బాగానే ఉన్నట్లు అర్ధమవుతుంది. ట్రైలర్ చివర్లో పవన్ , సాయి ధరమ్ తేజ్ వేసే స్టెప్పులు, కామెడీ ఉత్సాహం పెంచేలా ఉన్నాయి. జల్సా మూవీలోని స్టిల్ ను ఇందులో పవన్ కల్యాణ్ మరోసారి వేసి ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చారు. ఓవరాల్ గా బ్రో ట్రైలర్..సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తిని పెంచింది. మీరు కూడా ఈ ట్రైలర్ లుక్ వెయ్యండి.
Also Read: Nara Rohit : మీడియాని ప్రశ్నించనున్న నారా రోహిత్…