HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bro Collections Drop

BRO : కలెక్షన్లు ఏంటి ఇంత దారుణంగా పడిపోయాయి

పవన్ డిజాస్టర్ సినిమాలు సైతం రికార్డ్స్ బ్రేక్ చేసిన రోజులున్నాయి

  • Author : Sudheer Date : 01-08-2023 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bro Movie Two days Collections Pawan Kalyan Career heighest
Bro Movie Two days Collections Pawan Kalyan Career heighest

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాకు టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. పవన్ డిజాస్టర్ సినిమాలు సైతం రికార్డ్స్ బ్రేక్ చేసిన రోజులున్నాయి. కానీ బ్రో (BRO) విషయంలో ఎందుకో తేడా కొడుతుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది..అభిమానులు కోరుకున్నట్లు పవన్ డాన్సులు , సెంటిమెంట్ , కామెడీ ఇలా అన్ని ఉన్నాయి. కానీ ఎందుకో బాక్స్ ఆఫీస్ వద్ద చెప్పుకోదగ్గ కలెక్షన్లు రావడం లేదు. ముఖ్యంగా నిన్న సోమవారం దారుణంగా పడిపోయాయి.

పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Tej) తో కలిసి బ్రో మూవీ చేసాడు. తమిళంలో విడుదలైన ‘వినోదయ సిత్తం’ సినిమా కు రీమేక్ గా తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించగా సముద్రఖని దర్శకత్వం వహించాడు.

కేతికశర్మ, ప్రియా ప్రకాష్‌ లు హీరోయిన్లు గా నటించగా , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) స్క్రీన్ ప్లే , మాటలు అందించారు. భారీ అంచనాల మధ్య జులై 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాను చూసిన ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ అద్భుతం గా చేసాడని , సినిమాలో కామెడీ , ఎమోషన్ బాగా వర్క్ అయ్యాయని , థమన్ మ్యూజిక్ అదరగొట్టాడని ఇలా అంత పాజిటివ్ గా చెప్పుకొచ్చారు. ఈ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద పలు రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని అంత భావించారు. కానీ లెక్కలు తప్పాయి. రోజు రోజుకు కలెక్షన్లు (BRO collections) బాగా డ్రాప్ అవుతున్నాయి.

ఫస్ట్ డే రూ. 30.05 కోట్లు నెట్ కలెక్షన్స్  రాగా.. రెండో రోజు రూ. 17.05 కోట్లు, మూడోవ రోజు రూ. 16.9 కోట్లు, ఇక నాల్గో రోజు (సోమవారం ) కేవలం రూ. 7 కోట్లు మాత్రమే వచ్చి షాక్ ఇచ్చింది. ఓవరాల్ గా బ్రో సినిమాకు 4 రోజుల్లో రూ. 71 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు సమాచారం. మొదటి మూడు రోజులుగా గట్టిగానే వసూళ్లు చేసిన బ్రో..నాల్గో రోజు మాత్రం బాగా డ్రాప్ అయ్యాడు. రాబోయే రోజుల్లో ఇంకెంతగా డ్రాప్ అవుతాడో అని ఫ్యాన్స్ ఖంగారు పడుతున్నారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే..తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాలు కలుపుకుని రూ. 80.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. మరి ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్ లో వసూళ్లు చేస్తుందా లేదా అనేది చూడాలి.

Read Also : LPG Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. రూ. 100 తగ్గిన సిలిండర్ ధర..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bro
  • bro 4th day collections
  • BRO collections drop
  • Pawan Kalyan

Related News

Chandrababu Pawan Kalyan

తొందర పడొద్దంటూ చంద్రబాబు, పవన్ నిర్ణయం

బుధువారం జరిగిన రెండు గంటల సుదీర్ఘ భేటీలో, రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) కుట్రలు చేస్తోందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో అశాంతిని కలిగించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు

  • Pawan Kalyan Narrowly Escap

    పవన్ కళ్యాణ్ చెపితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారా ? – TPCC చీఫ్ మహేష్

  • Pawan Kalyan

    పవన్ కళ్యాణ్ ను రోజు తిడితే ఎమ్మెల్సీ పదవి !!

  • Pawan Kalyan Campaign In Mu

    తెలంగాణ మున్సిపల్ బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్

  • Bolli Shetty Satyanarayana

    జనసేనకు బిగ్ షాక్ ఇచ్చిన కీలక నేత..అయోమయంలో పార్టీ శ్రేణులు !!

Latest News

  • అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారంటూ పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు!

  • ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

  • ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

  • సీఎం రేవంత్ బినామీ కంపెనీకి రూ.6వేల కోట్ల పనులు – కేటీఆర్ సంచలన ఆరోపణలు

  • ముగిసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీ

Trending News

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd